Holi 2023: హోలీ రోజు నుంచి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. నష్ట నివారణ కోసం ఏ పరిహారాలు చేయాలంటే..

ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి మార్చి 06, 2023న సాయంత్రం 04:17 గంటలకు ప్రారంభమై మార్చి 07, 2023 సాయంత్రం 06:09 గంటలకు ముగుస్తుంది. కనుక హోలికా దహన్ మార్చి 07, 2023న నిర్వహించబడుతుంది. మర్నాడు అంటే మార్చి 08, 2023న హొలీ ఆడతారు. 

Holi 2023: హోలీ రోజు నుంచి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. నష్ట నివారణ కోసం ఏ పరిహారాలు చేయాలంటే..
Holi 2023
Follow us
Surya Kala

|

Updated on: Mar 07, 2023 | 2:40 PM

హిందూ మత విశ్వాసం ప్రకారం హోలీ పండుగ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగను రేపు అంటే మార్చి 8న దేశ వ్యాప్తంగా జరుపుకోనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈసారి హోలీ పండగ సమయంలో గ్రహాల సంచారం కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావాన్ని చూపించనున్నాయి. హోలీ రోజున గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి మంచిది కాదు. అటువంటి పరిస్థితిలో..  కొన్ని రాశుల వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

హోలీ ఎప్పుడు ఆడతారు? పంచాంగం ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీతో సహా అన్ని ప్రదేశాలలో 07 మార్చి 2023న హోలికా దహన్ ..  08 మార్చి 2023న రంగుల కేళి..  హోలీ ఆడతారు. అయితే ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి మార్చి 06, 2023న సాయంత్రం 04:17 గంటలకు ప్రారంభమై మార్చి 07, 2023 సాయంత్రం 06:09 గంటలకు ముగుస్తుంది. కనుక హోలికా దహన్ మార్చి 07, 2023న నిర్వహించబడుతుంది. మర్నాడు అంటే మార్చి 08, 2023న హొలీ ఆడతారు.

ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలంటే.. 

ఇవి కూడా చదవండి
  1. మేష రాశి: రాహువు ప్రభావం మేషరాశి వారిపై ఉండబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు.. మత్తు, తప్పు, ఒత్తిడి-ఆందోళన మొదలైన వాటితో పాటు ఆకస్మిక ప్రమాదాలకు కారకంగా పరిగణించబడతాడు. అందుకే ఈ రాశుల వారు ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి. అంతేకాదు ఎటువంటి చర్చలో పాల్గొనవద్దు.. లేకుంటే నష్టం జరగవచ్చు. దీనిని నివారించడానికి, శివుని పూజించండి,  శివ చాలీసా పఠించండి.
  2. వృషభం రాశి: ఈ  రాశి వారిపై అంగారకుడి ప్రభావం ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. అంగారకుడు  ఉగ్ర స్వభావుడు.. ఇది యుద్ధాలు, పోరాటాలకు కారణమవుతుంది. వృషభ రాశి వారిపై కుజుడు ప్రభావం చూపుతున్నందున అనవసరమైన తగాదాలు రాకుండా చూసుకోండి. తగాదాలకు పోవడం ఈ రాశివారికి హానికరం. ఈ రాశుల వారికి హనుమాన్ పూజ ప్రయోజనకరంగా ఉంటుంది.
  3. తుల రాశి: ఈ రాశి వ్యక్తులపై కేతు గ్రహ ప్రభావం పడనుంది. ఈ ప్రభావం వల్ల మీ దగ్గరి బంధువుల్లో ఎవరితోనైనా సంబంధాలు చెడిపోవచ్చు. అంతేకాదు అహంకారాన్ని తగ్గించుకోండి. అహంకారం వలన సామాజిక ఇమేజ్‌ను పాడు చేస్తుంది. ఈ రాశివారికి గణేష్ పూజ శుభప్రదం అవుతుంది.
  4. కుంభ రాశి:  హోలీ రోజున, కుంభరాశిలో గరిష్ట మార్పులు ఏర్పడనున్నాయి. బుధుడు, సూర్యుడు, శని గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వ్యక్తుల ఆరోగ్యం క్షీణించవచ్చు. గుండెకు సంబంధించిన ఏదైనా వ్యాధి ఉన్నవారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రతికూల పరిస్థితుల నుంచి దూరంగా ఉండండి. లేకుంటే ఈ రాశివారు ఇబ్బందుల్లో పడవచ్చు. కుంభ రాశి వారికి దుర్గామాత ఆరాధన మేలు చేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)