Holi 2023: ఈ గ్రామంలోని హొలీ వెరీ వెరీ స్పెషల్.. రంగులతో కాదు తేళ్లతో హొలీ ఆడతారు..

హోలీ ఆట ప్రారంభమైన వెంటనే కోట లోపల నుండి తేళ్లు బయటకు రావడం ప్రారంభమవుతాయని, హోలీ రోజున తేళ్లు ఏ మనిషిని కాటేవని గ్రామంలో నివసించే ప్రజలు అంటున్నారు. పిల్లలు చేతుల్లో తేళ్లు పట్టుకుని తిరుగుతుంటారు.. ఆ తేళ్లు పిల్లలతో చాలా హాయిగా ఆడుకుంటాయి.

Holi 2023: ఈ గ్రామంలోని హొలీ వెరీ వెరీ స్పెషల్.. రంగులతో కాదు తేళ్లతో హొలీ ఆడతారు..
holi is played with scorpions
Follow us
Surya Kala

|

Updated on: Mar 07, 2023 | 1:42 PM

దేశ వ్యాప్తంగా హొలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రాదయాలకు అనుగుణంగా హొలీ పండుగను జరుపుకుంటున్నారు. రంగులు, బెలూన్స్ , లేదా కోడి గుడ్లు, టమాటా వంటివి వాటితో రంగుల కేళీ హోలీని ఆడుతారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం విషపూరితమైన తేళ్లతో హొలీ వేడుకను జరుపుకుంటారు. ఈ వింత వేడుక ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని ఉస్రాహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తఖా తహసిల్ ప్రాంతంలోని సౌత్నా గ్రామంలో భైసన్ అనే శతాబ్దాల నాటి కోట ఉంది. ఈ కోటలో వేలాది ఇటుకలు, రాతి ముక్కలు పడి ఉన్నాయి. సాధారణంగా ఈ ఇటుకలను తీసినప్పుడు ఎటువంటి జంతువులు కనిపించవు. కానీ హోలీ పౌర్ణమి రెండవ రోజు సాయంత్రం కాగానే.. ఇటుకలు, రాళ్ల మధ్య నుండి వేలాది విషపూరితమైన తేళ్లు బయటకు రావడం ప్రారంభిస్తాయి. ఆ సమయంలో అక్కడకు  గ్రామంలోని పెద్దలు, పిల్లలు చేరుకుంటారు. ఆ మట్టిదిబ్బ దగ్గరికి చేరుకుని.. పెద్దలు, పిల్లలు ఆ తేళ్లను తమ చేతుల్లోకి ఎత్తుకొని ఒకరిపై ఒకరు విసురుకుంటూ హోలీ ఆడతారు.

హోలీ పాట ప్రారంభమైన వెంటనే కోట లోపల నుండి తేళ్లు బయటకు రావడం ప్రారంభమవుతాయని, హోలీ రోజున తేళ్లు ఏ మనిషిని కాటేవని గ్రామంలో నివసించే ప్రజలు అంటున్నారు. పిల్లలు చేతుల్లో తేళ్లు పట్టుకుని తిరుగుతుంటారు.. ఆ తేళ్లు పిల్లలతో చాలా హాయిగా ఆడుకుంటాయి.  ఈ గ్రామానికి చెందిన ప్రజలు.. ఈ తేళ్లను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఈ తేళ్లపై ఎవరూ దాడి చేయరు. అలాగే వాటిని చంపడానికి కూడా ప్రయత్నించరు. ఈ తేళ్లు పూర్తిగా సురక్షితం.. దీంతో గ్రామస్తులందరూ హొలీ రోజున ఆ తేళ్లను చేతులతో పట్టుకుని.. ఒకరిపై ఒకరు తేళ్లు విసురుకుంటూ హోలీని జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

శతాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయం తేళ్లతో హోలీ ఆడే ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది.  ఈ తెల్లతో హొలీ ఇటావా జిల్లాలోనే మాత్రమే కాదు..  సమీపంలోని అనేక జిల్లాల్లోకి పాకిపోయింది. దీంతో హొలీ రోజున భైసన్ కోట దగ్గరకు ఇతర జిల్లాల నుంచి ప్రజలు చేరుకుంటారు. తేళ్లు బయటకు వచ్చే వరకూ వేచి ఉండి.. వాటితో హొలీ వేడుక జరుపుకుంటారు.

ఇదే విషయంపై గ్రామ మాజీ పెద్ద ఉమాకాంత్ శుక్లా మాట్లాడుతూ ఇక్కడ అనేక దశాబ్దాలుగా తేళ్లు హొలీ రోజున బయటకు వస్తాయని.. ఇది కొని శతాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ అని తెలిపారు. హొలీ సందర్భంగా ఢంకా మోగినప్పుడు తేళ్లు బయటకు వస్తాయి.. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలు తేళ్లు తీసుకుని ఒకరిపై ఒకరు విసురుకుంటారు.

గుట్టలోంచి ఇటుకలు తీసిన తర్వాత తేళ్లు ఇంటి నుంచి బయటకు రావడం ప్రారంభిస్తాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కోటలోని తేళ్లు హొలీకి ముందు తర్వాత సర్వసాధారణంగా ఎవరికీ కనిపించవు. కానీ హోలీ తర్వాత పొరపాటున ఎప్పుడైనా తేళ్లు బయటకు వస్తే.. అవి కుడితే శరారంలో విషం వ్యాప్తిస్తుందని తెలిపారు.

మొఘల్ పాలనలో కూల్చివేయబడిన కోటలో తూర్పున ఒక ఆలయం ఉండేది. ఈ గుట్టపై విగ్రహాల అవశేషాలు లభ్యమయ్యాయి. పూర్వం ఈ ఆలయంలో గేదెలను బలి ఇచ్చారని పూర్వీకులు చెబుతారు. ఎవరైనా ఈ గుట్టలోంచి ఒక్క ఇటుక, రాయి తీసుకున్నా ఆ వ్యక్తి ఇంట్లోకి తేళ్లు రావడం మొదలవుతాయని చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)