మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. దురదృష్టానికి వెల్కమ్ చెప్పినట్లే.. వెంటనే అలవాట్లను మార్చుకోండి..
కొన్ని అలవాట్లు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఆరు పద్ధతులు ప్రతికూల శక్తిని పెంచడమే కాదు.. అనేక సమస్యలకు దారి తీరిస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఆలస్యంగా మేల్కొని ఉండటం, పెద్దలను అవమానించడం, జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం, అసూయపడటం, గోర్లు కొరకడం, నీటిని వృధా చేయడం వంటి అలవాట్లు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. ప్రతి అలవాటు.. దాని వలన వచ్చే పరిణామాలను.. వాటిని ఎలా నివారించాలో వివరించారు.

ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగేకొద్దీ.. నిరాశ, ఆందోళన, ఆర్థిక లేదా ఆరోగ్య సమస్యలు వంటి వివిధ రకాల సమస్యలను సృష్టిస్తుంది. కనుక ఇంటిని ఎల్లప్పుడూ సానుకూల శక్తితో నింపడానికి రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని అలవాట్లు ఇంట్లో దుష్టశక్తి పెరిగేలా చేస్తాయని.. జ్యోతిష్కులు చెప్పారు. ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచే అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..
ఆలస్యంగా నిద్ర పోవడం.. ఆలస్యంగా మేల్కొనడం:
ప్రతి రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అలవాటు మీకు ఉంటే.. అది మీకు మాత్రమే కాదు మీ ఇంటికి కూడా సమస్యలను కలిగిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. రాత్రి త్వరగా నిద్రపోవాలి.
పెద్దలను అవమానించడం:
ఎవరైనా సరే తమ ఇంట్లో పెద్దలను తమ గురువులను అగౌరవపరిస్తే అది హాని కలిగిస్తుందని నమ్ముతారు. ఈ అలవాటు జాతకంలోని గ్రహాలపై చెడు ప్రభావం చూపించి మానసిక స్థితిని పాడు చేస్తుంది. దీని కారణంగా ఏ పనిలోనూ విజయం సాధించలేరు. దీంతో ఉద్యోగంలో సమస్యలను, కెరీర్ వైఫల్యాన్ని కూడా కలిగిస్తుంది.
జంతువుల పట్ల క్రూరత్వం:
ఇంట్లో ఏవైనా జంతువులను పెంచుకుంటుంటే వాటికి హాని చేయవద్దు. జంతువులను హింసించడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఈ అలవాటు కేతువు చెడు చూపించేలా పరిణామాలను కలిగిస్తుంది. జీవితంలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
అసూయపడటం:
ఇతరుల విజయాన్ని చూసి మీరు అనుభవించే అసూయ కూడా ఒక సమస్యే. ఇది మిమ్మల్ని చంపడమే కాదు ఇంట్లో ప్రతికూల శక్తిని కూడా పెంచుతుంది. మీరు వేరొకరి పురోగతిని అడ్డుకోవాలని ఆలోచిస్తే, అది రాహు దోషంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది.
గోర్లు కొరకడం:
చాలా మందికి గోళ్లు కొరికే చెడు అలవాటు ఉంటుంది. ఇది ఎంత హానికరమో వారికి తెలియదు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే ఈ అలవాటు మీ జాతకంలో రాహువును బలహీనపరుస్తుంది. ఈ అలవాటు వలన శనిశ్వరుడి వల్ల హాని కలుగుతుంది. అలాగే ఇంట్లో కూర్చుని గోర్లను తీసే అలవాటు ఉంటే.. అలా గోళ్లను తీసి వాటిని ఎక్కడబడితే అక్కడ విసిరేయ వద్దు.
నీటి వృధా:
అనవసరంగా నీటిని వృధా చేస్తే.. ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. ఇంట్లో అనవసరమైన తగాదాలు వస్తాయి. నీటిని ఎంత ఎక్కువగా వృధా చేస్తారో.. ఇంట్లో అంత ఎక్కువగా విభేదాలు వస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు