రాత్రిపూట సోంపు గింజలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

16 March 2025

TV9 Telugu

TV9 Telugu

చాలామంది భోజనం తర్వాత కాస్తంత సోంపును నోట్లో వేసుకుంటూ ఉంటారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాల్లో అన్ని రకాల ఆహార పదార్థాలతోపాటు దీన్ని తప్పనిసరిగా పెడతారు. హోటల్స్‌లోనూ భోజనం చివర్లో ప్రత్యేకంగా అందిస్తారు. ఇందుకు కారణం ఆహారం బాగా జీర్ణమవుతుందనే

TV9 Telugu

సోంపు చాలా రుచిగా ఉండటమే కాదు ఔషధ గుణాలను కలిగి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 100 గ్రాముల సోంపులో 40 గ్రా. పీచు ఉంటుంది. ఇది ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది

TV9 Telugu

జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు ఆహారం తీసుకున్న తర్వాత దీన్ని తింటే  ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తరచూ ఆహారంతోపాటు తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి

TV9 Telugu

ఆహారం సరిగా జీర్ణమవ్వాలంటే సోంపు తీసుకుంటే సరి. అలాగే ఆకలి పెరగాలన్నా దీన్ని తీసుకోవాల్సిందే. గ్లాసు మజ్జిగలో చెంచా సోంపు వేసుకుని తాగితే విరేచనాలు తగ్గుముఖం పడతాయి

TV9 Telugu

సోంపు తినడానికే కాదు వీటితో తయారు చేసిన టీ కూడా చాలా మంది ఇష్టంగా తాగుతారు. సోంపును ఎప్పుడైనా తినవచ్చు. కానీ రాత్రిపూట సోంపు నమలడం వల్ల ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతుంది

TV9 Telugu

రాత్రి భోజనం తర్వాత, అర టీస్పూన్ సోంపు తినాలి. సోంపులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అలాగే ఇది చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది

TV9 Telugu

రాత్రిపూట సోంపు నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

నిద్రలేమి ఉన్నవారు సోంపును తప్పనిసరిగా తినాలి. సోంపు నమలడం వల్ల ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతుంది. సోంపు వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది