బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్ లాంటివి మంచి పోషకాహారమని, నీరసం, నిస్సత్తువ దరికి చేర్చవని మనందరికీ తెలుసు. కానీ వాటితో మరెన్నో లాభాలున్నాయి
TV9 Telugu
డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లలో ప్యాంక్రియాటిక్, బ్రెస్ట్ క్యాన్సర్లను నిరోధించే గుణాలున్నట్లుగా తాజా పరిశోధనల్లో తేలిందంటూ ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’ పత్రిక ప్రచురించింది
TV9 Telugu
అందుకే డ్రై ఫ్రూట్స్‌ను సూపర్‌ఫుడ్స్ అంటారు. ఆరోగ్య పరంగా ఇవి చాలా ప్రయోజనకరమైనవి. ఇందులో వివిధ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి
TV9 Telugu
డ్రై ఫ్రూట్స్ వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో వేసవిలో ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం
TV9 Telugu
వేసవి ఎండు ద్రాక్ష తినొచ్చు. ఎండుద్రాక్షలో అధిక మొత్తంలో పొటాషియం, ఇనుము ఉంటాయ. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. వేసవిలో వాటిని నీటిలో నానబెట్టి తినాలి
TV9 Telugu
వేసవిలో బాదం తినడం కూడా ప్రయోజనకరమే. 4 నుంచి 5 బాదంపప్పులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తినాలి
TV9 Telugu
అలాగే వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు వాల్‌నట్‌లు తింటే మెదడు చురుకుగా ఉంటుంది
TV9 Telugu
వేసవిలో ఆప్రికాట్లను కూడా తినొచ్చు. ఉదయం పూట రెండు చొప్పున ఆప్రికాట్లు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించి చేరుకుగా ఉంచుతుంది