Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుండగుల దుశ్చర్య.. కన్నీరుమున్నీరైన రైతు వీడియో

దుండగుల దుశ్చర్య.. కన్నీరుమున్నీరైన రైతు వీడియో

Samatha J

|

Updated on: Mar 16, 2025 | 7:35 PM

రైతులు పొలంలో విత్తనాలు నాటినప్పటినుంచి పంట చేతికి వచ్చేవరకూ చంటి బిడ్డలా చూసుకుంటాడు. చీడపీడలు, అడవి జంతువుల బారినుంచి అహర్నిశలు కావలి కాస్తూ రక్షించుకుంటాడు. పంటకు తెగులు వస్తే బిడ్డను అనారోగ్యం చేసినట్టు ఆవేదన చెందుతాడు. మందులతో పిచికారీ చేస్తాడు. పంట ఏపుగా పెరగాలని, మంచి దిగుబడి రావాలని అప్పుచేసి మరీ ఎరువులను వేస్తాడు. కాపుకొచ్చిన పైరును చూసి చేతికందొచ్చిన బిడ్డలా సంతోష పడిపోతాడు. మరి కొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందని, తన కష్టం ఫలిస్తుందని కొండంత ఆశతో ఎదురు చూస్తాడు.

  ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట దుండగుల పాలైతే ఆ రైతు ఆవేదన అంతా ఇంతా కాదు. తన బిడ్డనే కోల్పోయినంతగా కన్నీరు మున్నీరుగా విలపిస్తాడు. సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. కష్టపడి పండించుకున్న పంట కళ్లముందే అగ్నికి ఆహుతైపోయే నిస్సహాయంగా చూస్తూ గుండెలవిసేలా ఏడ్చాడు ఆ రైతు. పినపాక మండలం వెంకట్రావుపేటలో ఈ దారుణం జరిగింది ..కళ్ళంలో ఆరబెట్టిన మిర్చిని గుర్తు తెలియని దుండగులు, తగలబెట్టారు సుమారు 70 క్వింటాల మిర్చి చూస్తుండగానే దగ్ధమైపోయింది. పది లక్షల ఆస్తి నష్టం, జరిగింది. కళ్ళంలో ఆరబెట్టిన మిర్చిని తగలబెట్టారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటనలో సుమారు 70 క్వింటాల మిర్చి దగ్ధమైనట్లు రైతు పురుషోత్తం చెప్తున్నాడు. ఇది ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తెలియదని పురుషోత్తం కన్నీటి పర్యంతం అయ్యాడు. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం సుమారు 11 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపాడు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. భారీగా మిర్చి దగ్ధం అవడంతో ఆ ఘాటుకి ఊర్లో జనం కొన్ని గంటల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్‌!

విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం

నల్లగొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ కేసులో ఏం జరిగిందంటే వీడియో

అమెరికాలో సుదీక్ష మిస్సింగ్‌.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో