Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paper Cups: మీరూ టీ, కాఫీలు పేపర్‌ కప్‌లలో తాగుతున్నారా? అయితే త్వరలోనే మీకు క్యాన్సర్ పక్కా..

ఈ మధ్య కల్తీ రాయుళ్లు తెగ రెచ్చిపోతున్నారు. ప్రతిదీ కల్తీ మయం చేస్తున్నారు. ఇడ్లీలను వండడానికి ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారని, పుచ్చకాయకు కృత్రిమ రంగులు కలుపుతున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే పేపర్ గ్లాసులు వాడటం వల్ల కూడా మన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని మీకు తెలుసా? గతంలో దీని గురించి కొన్ని చర్చలు జరిగినప్పటికీ..

Paper Cups: మీరూ టీ, కాఫీలు పేపర్‌ కప్‌లలో తాగుతున్నారా? అయితే త్వరలోనే మీకు క్యాన్సర్ పక్కా..
Paper Cups
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 16, 2025 | 8:07 PM

కల్తీ రాయుళ్లు ఇడ్లీలను వండడానికి ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారని, పుచ్చకాయకు కృత్రిమ రంగులు కలుపుతున్నారనే విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కన్నెర్ర చేశాయి కూడా. అయితే ఇప్పుడు పేపర్ గ్లాసుల వంతు వచ్చింది. అవును.. పేపర్ గ్లాసులు వాడటం వల్ల కూడా మన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. గతంలో దీని గురించి కొన్ని చర్చలు జరిగినప్పటికీ.. ప్రజలు, ప్రభుత్వం దీని గురించి పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ ఇటీవలి కాలంలో బయట లభించే ఆహార నాణ్యత గురించి జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పేపర్‌ కప్‌లు కూడా తెరపైకి వచ్చాయి. పేపర్ గ్లాసులు కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని క్యాన్సర్ నిపుణులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. పేపర్‌ కప్‌లను వినియోగించడం ద్వారా కడుపులోకి ప్లాస్టిక్‌ చేరుతుందనీ, దీంతో తెలియకుండానే క్యాన్సర్‌ మహమ్మారి జనాల ప్రాణాలను హరిస్తుందని అంటున్నారు. కిద్వాయ్ ఆసుపత్రిలోని ఆరోగ్య నిపుణులు పేపర్ గ్లాసుల ప్రమాదాలపై పరిశోధనలు చేశారు. వీటి వాడరంపై ఆహార భద్రత, ప్రమాణాల విభాగానికి ఫిర్యాదు చేశారు. పేపర్‌ కప్‌ల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

పేపర్ గ్లాసుల్లో టీ తాగేవారికి కడుపు క్యాన్సర్

డాక్టర్ కిద్వాయ్ హాస్పిటల్‌లో క్యాన్సర్ నిపుణుడు నవీన్ దీని గురించి మాట్లాడుతూ.. పేపర్ గ్లాసుల్లో టీ తాగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేడికి పేపర్ గ్లాసు కరిగిపోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అదనంగా టీ కప్పులలోని మైక్రోప్లాస్టిక్‌లు కూడా క్యాన్సర్‌కు కారణమవుతాయి. ఈ మైక్రోప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరం. పేపర్ గ్లాస్ వాటర్ ప్రూఫ్ కానందున సాధారణంగా మైక్రోప్లాస్టిక్‌లను ఉపయోగిస్తారు. అందువల్ల, తెలియకుండానే మన కడుపులోకి ప్రవేశించే ప్లాస్టిక్ కణాలు నెమ్మదిగా క్యాన్సర్‌కు కారణమవుతాయని ఆయన అన్నారు.

పేపర్ కప్పులు క్యాన్సర్‌తో నేరుగా సంబంధం కలిగి ఉండవు. కానీ వాటి లైనింగ్‌లో ఉపయోగించే మైక్రోప్లాస్టిక్స్ లేదా పెర్ఫ్లోరోఅల్కైల్ (PFASYL) వంటి రసాయనాలు కడుపు క్యాన్సర్‌కు కారణమవుతాయి. ఇటీవల కడుపు క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు మీడియాతో పంచుకున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఏ హోటల్‌ అయినా, షాప్‌ అయినా టీ లేదా కాఫీ కోసం ఈ పేపర్ గ్లాసులనే వాడుతున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేసిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు సైతం విజ్ఞప్తులు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.