Samantha: సమంత న్యూ ఇయర్ రిజల్యూషన్ పోస్ట్ వైరల్.. తప్పులు దిద్దుకుంటా
ప్రముఖ నటి సమంత 2026 కోసం తన లక్ష్యాలను పంచుకున్నారు. అయితే, ఇషా ఫౌండేషన్‌లో ఆమె చేసుకున్న 'భూతశుద్ధి వివాహం'పై ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది సాధారణ పెళ్లి కాదని, గత దరిద్రం తొలగించుకోవడానికి చేసేదని, మాజీ భర్తతో దీనికి సంబంధం ఉందని పరోక్షంగా చెప్పడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సమంత 'మా ఇంటి బంగారం' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
ప్రముఖ నటి సమంత 2026 సంవత్సరంలోకి స్పష్టమైన లక్ష్యాలతో అడుగుపెట్టనున్నారు. కొత్త ఏడాదికి సంబంధించి తన ప్రణాళికను అభిమానులతో పంచుకున్నారు. ‘‘2026లో నేను’’ అంటూ తన ప్లానింగ్ వివరాలను ఓ ఫొటోపై పొందుపరిచారు. అవేంటంటే.. ఆత్మపరిశీలన, స్థిరంగా పని చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్లడం, లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగడం, సమాజానికి తిరిగి ఇవ్వడం, అనుబంధాలు ఏర్పరుచుకోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, కృతజ్ఞతతో ఉండడం. మీనాక్షీ చౌదరి సహా పలువురు సినీ ప్రముఖులు, సమంత అభిమానులు ఆమె పోస్టును లైక్ చేశారు. డిసెంబర్ 1న ఇషా ఫౌండేషన్‌లో సమంత, రాజ్ నిడిమోరు అత్యంత సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి మీడియా హంగామా లేకుండా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో, కేవలం 30 మంది అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. భూతశుద్ధి వివాహం విషయాన్ని ఎవ్వరూ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఇది వారి సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయమై అంతా భావించారు. కానీ ఈ వివాహ పద్ధతిపై ఆస్ట్రాలజర్ వేణు స్వామి తాజాగా కామెంట్స్ చేయడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. రాజ్‌ని సమంత భూతశుద్ధి వివాహం చేసుకోవడం వెనుక కొన్ని సీక్రెట్స్ ఉన్నాయట. ఇలా ఆమె వివాహం చేసుకుంది ఆమె మాజీ భర్త వల్లే అని తెలిసేలా వేణుస్వామి కొన్ని కామెంట్స్ చేశారు. భూతశుద్ధి అనేది అసలు పెళ్లి కానేకాదని వేణు స్వామి అన్నారు. భూతశుద్ధి వేరు.. వివాహం వేరు. అది కేవలం అంతకుముందు మనకు ఎవరి వల్లనైనా, ఏదైనా దరిద్రం అంటుకుంటే అది తొలగించుకోవడానికి చేసుకునేదని చెప్పారు. ఏదైనా మనిషి వల్ల మనకు వచ్చిన నష్టాన్ని నయం చేసే పద్ధతి అది అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కామెంట్స్ మరోసారి దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సమంతే నిర్మిస్తుండటం విశేషం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Himalayas: మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ. 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..

