AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రొమ్ములను తీయించుకున్న ఏంజెలినా జోలీ

రొమ్ములను తీయించుకున్న ఏంజెలినా జోలీ

Phani CH
|

Updated on: Dec 20, 2025 | 6:49 PM

Share

ఆంజెలినా జోలీ టైమ్స్ మ్యాగజైన్ కోసం రొమ్ము క్యాన్సర్ ముందస్తు చికిత్స మచ్చలను వెల్లడించారు. మాస్టెక్టమీ ద్వారా తొలగించుకున్న రొమ్ముల స్కార్స్‌ను ప్రపంచానికి చూపారు. తన తల్లి క్యాన్సర్‌తో మరణించినందున, తోటి మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పుపై అవగాహన కల్పించి, మాస్టెక్టమీకి ధైర్యం కల్పించాలనేది ఆమె లక్ష్యం. ఈ ఫోటోషూట్ మహిళా సాధికారతకు స్ఫూర్తి.

హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీ సంచలన ఫొటో షూట్ చేశారు. టైమ్స్ మ్యాగజైన్ ఫ్రాన్స్ కవర్ పేజీ కోసం తాను తీసుకున్న రొమ్ము క్యాన్సర్ ముందస్తు చికిత్స మచ్చలను బయటపెట్టారు. తనకు క్యాన్సర్ ముప్పు ఉందని తెలిసి ‘మాస్టెక్టమీ’ ద్వారా ఏంజెలినా జోలీ తన రెండు రొమ్ములను తొలగించుకున్నారు. తన ఛాతీపై అయిన స్కార్స్ ను తొలిసారి ప్రపంచానికి చూపించారు. తోటి మహిళలకు ధైర్యం ఇచ్చేందుకే ఈ పని చేసినట్లు నటి తెలిపారు. ఆమె తల్లి, నటి మార్షెలిన్ బెర్ట్రాండ్ రొమ్ము క్యాన్సర్ తో 56 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. క్యాన్సర్ వంశపారంపర్యంగా తనకూ వచ్చే అవకాశం ఉందని తెలుసుకుని ఏంజెలినా జోలీ సుదీర్ఘ సంఘర్షణ తర్వాత మాస్టెక్టమీ ద్వారా రొమ్ములు తొలగించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి, ఆపరేషన్ తర్వాత తాను మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు జోలీ తెలిపారు. ఇప్పటికీ చాలామంది మహిళలు తమకు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఉందని తెలిసినా మాస్టెక్టమీకి సిద్ధపడరని చెప్పారు. వారికి ధైర్యం కల్పించేందుకు, ఆపరేషన్ కోసం వారు ముందుకు వచ్చేలా చేయడానికి తాను ఈ ఫొటోషూట్ కు అంగీకరించానని జోలీ అన్నారు. అమెరికాను వీడి విదేశాల్లో స్థిరపడాలని జోలీ యోచిస్తున్నట్లు సమాచారం. బ్రాడ్ పిట్‌తో పిల్లల కస్టడీ ఒప్పందం కారణంగా తాను లాస్ ఏంజిల్స్‌లో నివసించాల్సి వచ్చిందని, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో తాను చూసిన మానవత్వం, ప్రశాంతత లాస్ ఏంజిల్స్‌లో కనిపించలేదని ఆమె ఒక ఇంటర్వ్యూలో అన్నారు. విడాకుల కారణంగానే తాను అక్కడ చిక్కుకుపోయినట్లు చెప్పారు. విదేశాల్లో ఎక్కడ స్థిరపడాలనే దానిపై ఏంజెలినా పలు దేశాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా తన పెద్ద దత్త కుమారుడు మాడాక్స్‌ సొంత దేశం కాంబోడియా అంటే ఆమెకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బహుశా కాంబోడియాలో స్థిరపడాలనే ఆలోచనలో కూడా ఆమె ఉండి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. జోలీ ఇకపై ‘ది ఇనిషియేటివ్’ అనే స్పై థ్రిల్లర్‌లో నటించనున్నారు.2017లో ఆమె 24.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన చారిత్రాత్మక సిసిల్ బి డిమిల్లీ ఎస్టేట్‌ను కూడా అమ్మకానికి పెట్టనున్నట్లు సమాచారం. సినిమా సెట్‌లో ప్రేమలో పడిన ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ 2014లో వివాహం చేసుకున్నారు. రెండేళ్లకే 2016లో విడిపోయారు. అప్పటి నుంచి పిల్లల కస్టడీ, ఆస్తుల పంపకాలపై సుదీర్ఘ న్యాయపోరాటం చేసారు. వీరికి ఆరుగురు సంతానం. వారి విడాకులు 2024 డిసెంబర్‌లో అధికారికంగా ఖరారయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది కుక్క కాదు.. నా కూతురు ! డిపెండెంట్‌ హోదా ఇవ్వాలని కోర్టుకెక్కిన మహిళ

ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

Demon Pavan: మారుతున్న బిగ్‌బాస్ ఓటింగ్ ట్రెండ్ దూసుకొస్తున్న డీమాన్

Bandla Ganesh: ఓజీ డైరెక్టర్‌కు కాస్ల్టీ గిఫ్ట్‌ ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్

Chinmayi: వాళ్లందరూ జంతువుల కన్నా హీనం..! నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం