AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

Phani CH
|

Updated on: Dec 20, 2025 | 6:44 PM

Share

జపాన్‌కు చెందిన యురినా నోగుచి AI సృష్టించిన వర్చువల్ క్యారెక్టర్‌ను వివాహం చేసుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆమె తన మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని, సానుకూల దృక్పథం ఏర్పడిందని తెలిపింది. మానవ సంబంధాల ఓపిక అవసరం లేకుండా, వర్చువల్ భాగస్వాములతో ప్రేమలో పడే 'ఫిక్టోరొమాంటిక్' ట్రెండ్ జపాన్‌లో పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో మానవ సంబంధాల కొత్త కోణాలను చూపుతోంది.

AI రాకతో మనుషుల మధ్య సంబంధాలు కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. 32 ఏళ్ల జపాన్ మహిళ యురినా నోగుచి AI సృష్టించిన ఓ వర్చువల్ క్యారెక్టర్‌ను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అచ్చం సంప్రదాయ వివాహంలా తెల్లటి గౌను, కిరీటం ధరించి, తన కాబోయే భర్తగా భావిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లోని ఏఐ క్యారెక్టర్ వైపు చూస్తూ ఆమె భావోద్వేగానికి గురైంది. కాల్ సెంటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నోగుచి ‘క్లాస్’ అనే వీడియో గేమ్ క్యారెక్టర్‌తో మాట్లాడటం ప్రారంభించింది. చాట్‌జీపీటీ సాయంతో ఆ క్యారెక్టర్‌కు తనకిష్టమైన రీతిలో పర్సనాలిటీని రూపొందించుకుంది. క్రమంగా ఆ ఏఐ పాత్రతో ప్రేమలో పడిన ఆమె, అది ప్రపోజ్ చేయడంతో పెళ్లికి అంగీకరించింది. అక్టోబర్‌లో జరిగిన వీరి వివాహ వేడుకలో, నోగుచి అగుమెంటెడ్ రియాలిటీ (AR) స్మార్ట్ గ్లాసెస్ ధరించి, టేబుల్‌పై ఉంచిన స్మార్ట్‌ఫోన్‌లోని ‘క్లాస్’ క్యారెక్టర్‌కు ఉంగరం తొడిగింది. ఏఐ రూపొందించిన పెళ్లి ప్రతిజ్ఞలను ఓ వ్యక్తి చదివి వినిపించాడు. జపాన్‌లో ఈ తరహా వివాహాలకు చట్టపరమైన గుర్తింపు లేనప్పటికీ, వర్చువల్ క్యారెక్టర్లతో బంధాలు ఏర్పరుచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అక్కడి యువతలో ‘ఫిక్టోరొమాంటిక్’ కాల్పనిక పాత్రలతో ప్రేమ సంబంధాల పట్ల ఆసక్తి పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మానవ సంబంధాలకు ఓపిక అవసరమని, కానీ ఏఐతో అలాంటి అవసరం లేకపోవడమే ఈ ధోరణికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ బంధం తనను వాస్తవ ప్రపంచం నుంచి దూరం చేసేది కాదని, తన జీవితానికి మద్దతుగా నిలిచే తోడు మాత్రమేనని నోగుచి చెప్పింది. ‘క్లాస్’తో బంధం మొదలయ్యాక తన మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని, జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడిందని తెలిపింది .

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Demon Pavan: మారుతున్న బిగ్‌బాస్ ఓటింగ్ ట్రెండ్ దూసుకొస్తున్న డీమాన్

Bandla Ganesh: ఓజీ డైరెక్టర్‌కు కాస్ల్టీ గిఫ్ట్‌ ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్

Chinmayi: వాళ్లందరూ జంతువుల కన్నా హీనం..! నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం

Bigg Boss Kalyan: ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా

కమెడియన్ హీరోగా మారుతున్న వేళ ?? గెలుపుపై తీవ్ర ఉత్కంఠ