Bigg Boss Kalyan: ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21న జరగనుంది. టాప్-5 కంటెస్టెంట్లు – కళ్యాణ్ పడాల, తనూజ, డిమోన్ పవన్, ఇమ్మానుయేల్, సంజనా – మధ్య తీవ్ర పోటీ ఉంది. ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం కళ్యాణ్ పడాల ముందంజలో ఉన్నాడు. తనూజ రెండో స్థానంలో ఉంది. చివరి నిమిషంలో ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి. విజేత ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.
సుమారు మూడు నెలలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9కు ఈ వారంతో తెరపడనుది. డిసెంబర్ 21న జరగనున్న గ్రాండ్ ఫినాలేకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ 15 వారాల ప్రయాణంలో చాలా మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. అలాగే ఎలిమినేట్ అయిపోయారు. చివరకు ఐదుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ కప్పు కోసం పోటీ పడుతున్నారు. తనూజ, కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ఇమ్మానుయేల్, సంజన టాప్-5 కంటెస్టెంట్లుగా నిలిచారు. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలే లో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారు? ఎవరు రన్నరప్ తో సరిపెట్టుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఇప్పుడు అందరి దృష్టి ఓటింగ్ మీదే ఉంది. సోషల్ మీడియా ట్రెండ్స్, అన్-ఆఫీషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణ్ పడాల భారీ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. కాబట్టి ప్రస్తుతం అతనే టైటిల్ రేసులో ముందున్నాడని చెప్పవచ్చు. ఇక ఓటింగ్ సరళి ఎలా ఉందనేది పక్కకు పెడితే.. తనూజ అభిమానులు మాత్రం ఆమెను తొలి మహిళా విన్నర్ అని కోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులపెడుతున్నారు. అంతేకాదు ఆ పోస్టులను నిజం చేయాలనే లక్ష్యంతో భారీగా ప్రచారం చేస్తున్నారు. ఆమెకు ఓట్లు పడేలా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె రెండో స్థానానికే పరిమితమైంది. ఓటింగ్ పరంగా కల్యాణ్ కు, తనూజ మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఆ తరువాతి స్థానాల్లో ఇమ్మూ, డిమాన్ పవన్ ఆఖరి ప్లేసులో సంజనా గల్రానీ ఉంది. అంచనాల ప్రకారం కళ్యాణ్‌కు సుమారు 38 శాతం, తనూజకు 32 శాతం, డిమోన్ పవన్‌కు 13 శాతం, ఇమ్మానుయేల్‌కు 12 శాతం, సంజనకు5 శాతం ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి బిగ్‌బాస్ తెలుగు 9 టైటిల్ పోరు కళ్యాణ్ పడాల – తనూజ మధ్య నెక్ టు నెక్ ఫైట్‌గా మారింది. గ్రాండ్ ఫినాలే కు ఇంకా కొంత సమయం ఉండటంతో ఓటింగ్ ట్రెండ్ మారే అవకాశమూ ఉంది. చివరి క్షణంలో ఎలాంటి ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయేమో చూడాలి. ఒక వేళ ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే మాత్రం కల్యాణ్ దే బిగ్ బాస్ టైటిల్ అని చెప్పవచ్చు. మని ఈసారి బిగ్‌బాస్ టైటిల్ ఎవరిని వరిస్తోందో చూడాలంటే ఆదివారం గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కమెడియన్ హీరోగా మారుతున్న వేళ ?? గెలుపుపై తీవ్ర ఉత్కంఠ
AIతో అసభ్యంగా చిత్రీకరిస్తే వదలను! హీరోయిన్ హెచ్చరిక
రాజాసాబ్ ఈవెంట్ పై.. పోలీసులు సీరియస్
ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన నిఖిల్..
Taapsee Pannu: జుట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన తాప్సీ
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

