AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..

Phani CH
|

Updated on: Dec 20, 2025 | 7:06 PM

Share

వనపర్తి జిల్లాలో ఓ లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్ముకొని కృష్ణానదిలోకి వెళ్ళబోయాడు. తెల్లవారుజామున మ్యాప్స్ చూపిన దారిలో వెళ్తూ, జూరాల వద్ద నది తీరానికి చేరుకున్నాడు. చివరి నిమిషంలో ప్రమాదాన్ని గుర్తించి లారీని నిలిపాడు. స్థానికుల సహాయంతో లారీని వెనక్కి తీసుకురాగలిగారు. మ్యాప్స్‌పై పూర్తిగా ఆధారపడకుండా, స్థానికులను అడగాలని గ్రామస్థులు డ్రైవర్‌కు సూచించారు.

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని గుడ్డిగా వెళ్తే… ఓ లారీ కృష్ణానదికి వెళ్లింది. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని బేతంచర్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్‌కు బండల లోడుతో లారీ బయలుదేరింది. అయితే జాతీయ రహదారి 44 మీదుగా కొత్తకోట వరకు వచ్చిన తర్వాత ఆత్మకూర్ నుంచి మక్తల్ వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ సహాయంతో ముందుకు సాగాడు లారీ డ్రైవర్ బాషా. ఈ క్రమంలో ఆత్మకూర్ చౌరస్తా చేరుకునే సరికి తెల్లవారుజాము అయ్యింది. అయితే చౌరస్తాలో టర్న్ తీసుకోవాల్సిన డ్రైవర్… గూగుల్ మ్యాప్ ప్రకారం నేరుగా వెళ్లాడు. అలా జూరాల గ్రామం వైపునకు ప్రయాణించాడు. గ్రామం దాటిన తర్వాత కూడా అలానే ముందుకు సాగాడు. ఇంతలోనే లారీ కుదుపులు ఎక్కువ కావడం… కొంత దూరంలోనే నీరు కనిపిస్తుండడంతో ఏదో అనుమానం కలిగింది. ఒక్కసారిగా లారీ నిలిపి దిగి చూడగా… దెబ్బకు లారీ డ్రైవర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంకాస్త దూరం వెళ్తే నేరుగా కృష్ణా నదిలోకి లారీ వెళ్లిపోయేది. అప్పటికే లారీ నది తీరంలోని ఘాట్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా పెను ప్రమాదం తప్పిందని భావించాడు. వెంటనే లారీ టైర్ల కింద రాళ్లను అడ్డుపెట్టి ముందుకు వెళ్లకుండా నిలిపాడు. గ్రామస్థులకు సమాచారం అందించి… జరిగిన విషయం లారీ ఓనర్‌కు చెప్పాడు. గుల్‌ను గుడ్డిగా నమ్ముకుంటే ఇలానే అవుద్దని స్థానికులు లారీ డ్రైవర్ బాషాకు చురకులు అంటించారు. స్థానికుల సహాయంతో లారీలోని బండల లోడ్‌ను మరో లారీలోకి ఎక్కించారు. ఇక జేసీబీ సహాయంతో ఘాట్‌పైన ఉన్న లారీని వెనక్కి లాగి రోడ్డు పైకి ఎక్కించి తిరిగి పంపించేశారు. ఇక నుంచి గుడ్డిగా గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అవ్వకుండా, సందేహం ఉన్న చోట స్థానికులను అడిగి తెలుసుకోవాలని జూరాల గ్రామస్థులు లారీ డ్రైవర్ బాషాకు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజుకి రూ. 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు

రొమ్ములను తీయించుకున్న ఏంజెలినా జోలీ

అది కుక్క కాదు.. నా కూతురు ! డిపెండెంట్‌ హోదా ఇవ్వాలని కోర్టుకెక్కిన మహిళ

ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

Demon Pavan: మారుతున్న బిగ్‌బాస్ ఓటింగ్ ట్రెండ్ దూసుకొస్తున్న డీమాన్