తమిళనాడులో భీమా సొమ్ము కోసం ఇద్దరు కుమారులు తమ తండ్రి గణేశన్ను పాముకాటుతో చంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్లో తిరువళ్లూరు జిల్లాలో ఈ ఘాతుకం జరిగింది. మూడు కోట్ల రూపాయల భీమా డబ్బుల కోసం చేసిన ఈ ప్లాన్, వారి వింత ప్రవర్తనతో భీమా సంస్థకు అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడింది.