- Telugu News Photo Gallery Business photos Complete details about the Public Provident Fund scheme offered by the Post Office
Post Office Schemes: కేవలం రూ.500 పెట్టుబడితో లోన్ సౌకర్యం.. ఈ అద్భుత పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలిస్తే ఛాన్స్ మిస్ చేసుకోరు
భారతీయ పోస్టల్ శాఖ అనేక సేవింగ్స్ స్కీమ్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. బ్యంకులతో పోలిస్తే అధిక వడ్డీ వీటిల్లో ఉంటుంది. దీంతో పోస్టల్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. పోస్టల్ పథకాలకు భారీగా ఆదరణ కూడా ఉంటుంది. పోస్టల్ శాఖలోని ఒక అద్బుతమైన పథకం గురించి ఇందులో తెలుసుకుందాం.
Updated on: Dec 20, 2025 | 6:43 PM

ఇండియన్ పోస్టల్ శాఖ బ్యాంకులకు పోటీగా అనేక సేవింగ్స్ స్కీమ్స్‌ను తీసుకొస్తుంది. పోస్టల్ శాఖపై ప్రజలకు నమ్మకం ఎక్కువ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో డబ్బులు సేఫ్‌గా ఉంటాయని, ఎలాంటి ఇబ్బందులు రావని అందరూ నమ్ముతారు. అందుకే పోస్టాఫీస్ స్కీమ్స్‌లో తమ డబ్బులు పొదుపు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు

బ్యాంకులతో పోలిస్తే సులభ వాయిదాల్లో పొదుపు చేసుకునే అవకాశంతో పాటు అధిక వడ్డీని పోస్టల్ శాఖ అందిస్తోంది. దీంతో పోస్టాఫీస్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. చిన్న మొత్తంలో పొదుపు చేసుకుని పెద్ద మొత్తంలో రాబడి పొందాలనుకునేవారి కోసం పోస్టాఫీసుల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే స్కీమ్ అందుబాటులో ఉంది.

ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినవారికి సంవత్సరానికి 7.1 శాతం ట్యాక్స్ ఫ్రీ వడ్డీని అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో పెట్టుబడి పెట్టినవారికి సెక్షన్ 80సీ ప్రకారం ట్యాక్స్ మినహాయింపు కూడా లభిస్తుంది. సంవత్సరానికి కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు.

ఈ పథకానికి 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉండగా.. 5 సంవత్సరాల తర్వాత కొంత మొత్తం తీసుకునే అవకాశముంది, ఇక ఉన్న చదువులు, అనారోగ్య కారణాల వల్ల 5 సంవత్సరాల తర్వాత మీరు పర్మినెంట్‌గా క్లోజ్ చేసుకుని అప్పటివరకు ఉన్న సొమ్మును తీసుకోవచ్చు.

ఇక ఒక సంవత్సరం తర్వాత మీ అకౌంట్ బ్యాలెన్స్‌పై లోన్ కూడా పొందొచ్చు. ఇక 15 సంవత్సరాల తర్వాత మీకు అవసరమైతే మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ఇలా ఈ స్కీమ్‌లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందవచ్చు.




