సౌదీ అరేబియా ఎడారి వాతావరణానికి భిన్నంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురవడంతో రోడ్లు, ఇళ్లు, వాహనాల పైకప్పులు మంచుతో కప్పబడి తెల్లటి తివాచీలా కనువిందు చేస్తున్నాయి. ఈ ఊహించని మంచు వర్షాన్ని చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.