Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపల కోసం వల వేస్తే.. చిక్కింది చూసి పరేషాన్‌! దెబ్బకు ఊరంతా పరుగో పరుగు..

చేపట వేలకు వెళ్లిన ఓ మత్స్యకారుడు రోజు మాదిరిగానే చెరువు వద్దకు వెళ్లాడు. చెరువులో వల వేసిన కాసేపటికి చేపల వల బరువెక్కింది. చేపలు దండిగా పడి ఉంటాయని గంపెడు ఆశతో వలలాగాడు. తీరా వల లోపల చిక్కినదాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. ఇంతకీ ఆ వల లోపల ఏం చిక్కిందంటే..

చేపల కోసం వల వేస్తే.. చిక్కింది చూసి పరేషాన్‌! దెబ్బకు ఊరంతా పరుగో పరుగు..
Fishing At Pond
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 14, 2025 | 5:51 PM

రాయపర్తి, మార్చి 14: పండగ పూట ఓ మత్స్యకారుడికి ఊహించని షాక్‌ తగిలింది. చేపలు పడదామని రోజుమాదిరిగానే చెరువు వద్దకు వెళ్లిన జాలర్లు కొందరు చెరువులో వల వేశారు. కాసేపటికి ఓ జాలరి చేపల వల బరువెక్కింది. చేపలు దండిగా పడి ఉంటాయని గంపెడు ఆశతో వలలాగాడు. తీరా వల లోపల చిక్కినదాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని కొండాపురంలో ఓ జాలరి శుక్రవారం (మార్చి 14) చేపటు పట్టేందుకు వెళ్లగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని కొండాపురంలో కొందరు జాలర్లు హోలీ పండుగ సందర్భంగా గ్రామంలోని ఊర చెరువులో చేపల వేటకు వెళ్లారు. చేపల కోసం అందరూ వలలు వేశారు. ఈ క్రమంలో ఓ జాలరి వల బరువెక్కడంతో అతడు ఆశగా దానిని బయటకు లాగాడు. అయితే వల లోపల చేపలకు భారీ కొండచిలువ చిక్కింది. వలలో కొండ చిలువ చూసిని మత్స్యకారులు భయంతో అల్లంత దూరం పరుగులంకించుకున్నారు. ఈ విషయం క్షణాల వ్యవధిలో ఊరంతా పాకడంతో గ్రామస్థులు కొండచిలువను చూసేందుకు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకున్నారు.

Python Caught In Fishing Net

ఇవి కూడా చదవండి

కాగా ఇలాంటి సంఘటనలు తరచూ పలుమార్లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అప్పడప్పుడూ జాలర్లకు భారీ ఆదాయాన్ని చేకూర్చే అరుదైన చేపలు మాత్రమేకాకుండా ఒక్కోసారి ఇలా పాములు, భారీ సైజులో ఉండే తాబేళ్లు, కప్పలు వంటివి కూడా వలలకు చిక్కుకుంటూ ఉంటాయి. ఆ మధ్య ఓ వ్యక్తి వల వేస్తే ఏకంగా మొసలి రావడం మరింత విడ్డూరం. వీటిని తిరిగి నీళ్లలో వదిలేయడమో, అటవీ అధికారులకు సమాచారం అందిస్తే వారు వాటిని సురక్షి ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేయడమో చేస్తుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.