Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Box Office Queen: సినీ ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న బాక్సాఫీస్‌ క్వీన్‌ సెంటిమెంట్.. ఆమె నటిస్తే కనక వర్షం పక్కా!

నిన్నమొన్నటి వరకూ అంతా ముద్దుగా 'నేషనల్ క్రష్' అని పిలుచుకునే రష్మిక మందన్న.. ఇప్పుడు వరుస బ్లాక్‌బస్టర్ హిట్‌లు కొట్టడంతో 'బాక్సాఫీస్ క్వీన్‌'గా మారిపోయింది. గత 16 నెలల్లో మూడే సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి వచ్చినంత పాపులారిటీ ఇండియన్‌ సినీ చరిత్రలో మరెవ్వరికీ రాలేదంటే అతిశయోక్తి కాదు..

Box Office Queen: సినీ ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న బాక్సాఫీస్‌ క్వీన్‌ సెంటిమెంట్.. ఆమె నటిస్తే కనక వర్షం పక్కా!
Box Office Queen
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 13, 2025 | 8:30 PM

నిన్నమొన్నటి వరకూ అంతా ముద్దుగా ‘నేషనల్ క్రష్’ అని పిలుచుకునే రష్మిక మందన్న.. ఇప్పుడు వరుస బ్లాక్‌బస్టర్ హిట్‌లు కొట్టడంతో ‘బాక్సాఫీస్ క్వీన్‌’గా మారిపోయింది. గత 16 నెలల్లో మూడే సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి వచ్చినంత పాపులారిటీ ఇండియన్‌ సినీ చరిత్రలో మరెవ్వరికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. యానిమల్ (2023), పుష్ప 2: ది రూల్ (2024), చావా (2025).. మూడు మువీలు బాక్సాఫీస్‌ వద్ద కనీవినని రీతిలో కనక వర్షం కురిపించాయి. రణబీర్ కపూర్, అల్లు అర్జున్, విక్కీ కౌశల్‌.. తో నటించిన ఈ మూడు సినిమాలు ఏకంగా రూ.3300 కోట్లు రాబట్టాయి మరి. దీంతో బాక్సాఫీస్ పవర్‌హౌస్‌గా అందరూ రష్మికను తెగ పొగిడేస్తున్నారు. రష్మిక పాత్రల ఎంపిక, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, అసాధారణమైన యాక్టింగ్‌ స్కిల్స్.. ఒక్కసారిగా స్టార్‌డమ్‌ పెంచేశాయి.

దీంతో ఈ భామ ఇండియా సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరోయిన్‌లలో ఒకరిగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ముఖ్యంగా రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మువీ రూ. 502.98 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ హిందీలో ఏకంగా రూ. 812 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక తాజాగా విడుదలైన చావా బాక్సాఫీస్ వద్ద ఇంకా కనక వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ మువీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది చివరి నాటికి రష్మిక స్టార్‌డమ్‌ మరింత పెరిగే ఛాన్స్‌ లేకపోలేదు. ఎందుకంటే.. ఒకప్పటి లక్కీ క్వీన్‌ ప్రియాంక చోప్రా అమెరికాలో స్థిరపడిన తర్వాత దీపికా పదుకొనే చాలా యేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఎదురులేని యువరాణిలా ఏలింది. ఆ తర్వాత ఆ స్థానం ఆలియా భట్ భర్తీ చేసింది.

ఇప్పుడు రష్మిక అదే ట్రాక్‌లో దూసుకుపోతుంది. వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్న ఈ కన్నడ భామ తదుపరి మువీ సల్మాన్ ఖాన్‌తో చేయనుంది. 2025లో బాలీవుడ్‌లో హిట్ పక్కా అని బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా AR మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నదియాద్వాలా నిర్మిస్తున్న యాక్షన్ డ్రామా మువీ ‘సికందర్‌’ లో సల్మాన్ ఖాన్‌కు జోడీగా రష్మిక నటించనుంది. ఈ మువీ 2025 ఈద్‌కు విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర, ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో థమ అనే మరో రెండు సినిమాలు కూడా ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్నాయి. థమలో ఆయుష్మాన్ ఖురానాతో రష్మిక జోడీ కడుతోంది. ఇప్పటికీ ఈ మువీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ ఏడాది దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక మందన్న పవర్‌హౌస్ సెంటిమెంట్ ఎంత మేర వర్కౌట్ అవుతుందో చూడాలి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.