ట్రెండ్ అవుతున్న తారక్ కొత్త సినిమా టైటిల్.. ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉంటుంది
కొందరు హీరోలకు సరైన టైటిల్స్ దొరక్క నానా తంటాలు పడుతుంటారు.. సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చినా కరెక్ట్ పేరు కోసం కష్టపడుతుంటారు దర్శకులు. కానీ అదేంటో గానీ ఎన్టీఆర్‌కు మాత్రం ముహూర్తం పెట్టినరోజే పవర్ ఫుల్ టైటిల్స్ లాక్ అవుతున్నాయి. తాజాగా ఎప్పుడో రాబోయే సినిమాకు.. ఇప్పుడే టైటిల్ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఏంటా సినిమా..? దర్శకుడెవరు..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 13, 2025 | 6:55 PM

స్టార్ హీరోల సినిమాలకు టైటిల్ కీలకం.. అది పవర్ ఫుల్‌గా ఉంటేనే అంచనాలు కూడా భారీగా ఉంటాయి. తాజాగా ఎన్టీఆర్ సినిమాలకు ఇది బాగా వర్కవుట్ అవుతుంది.

దర్శకుల మాయో ఏమో గానీ ఈయన సినిమాలకు టైటిల్స్ మాత్రం మామూలుగా ఉండట్లేదు. అరవింద సమేత వీరరాఘవ, దేవర, వార్ 2 లాంటి పవర్ ఫుల్ టైటిల్స్ పడుతున్నాయి.

బేసిక్‌గా ఎన్టీఆర్‌తో సినిమా అన్నపుడే టైటిల్‌పై స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు దర్శకులు. కొరటాల సినిమాకు దేవర టైటిల్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ టైటిల్ కన్ఫర్మ్ అయిందని తెలిసినప్పటి నుంచి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

తాజాగా నెల్సన్ సినిమాకు ఇలాంటి టైటిలే పరిశీలిస్తున్నారు మేకర్స్. వార్ 2, డ్రాగన్ తర్వాత దేవర 2 లైన్‌లో ఉంది. దీని తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నారు తారక్.

ప్యాన్ ఇండియన్ అప్పీల్ ఉండేలా దీనికి ROCK అంటే రాక్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి దేవర, డ్రాగన్, రాక్.. ఇలా పవర్ ఫుల్ టైటిల్స్‌తో రచ్చ చేస్తున్నారు జూనియర్.





























