Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా టార్గెట్ 100 డేస్.. అలా ఫిక్సైపోయిన స్టార్ హీరోలు

టాలీవుడ్ హీరోలు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు.. అదే టార్గెట్ 100 డేస్. అంటే ఇప్పుడేంటి 100 రోజుల సినిమా ఇచ్చేయాలని ఫిక్సైపోయారా అనుకోవద్దండోయ్..! ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో 10 రోజుల సినిమానే కష్టం.. ఇక 100 రోజులంటే నవ్వుతారు. పోనీ 100 కోట్ల సినిమాలా అనుకుంటే అంతా ఈజీగా అందుకుంటున్నారాయే..! అదీ కానప్పుడు ఏంటి ఈ టార్గెట్ 100 డేస్ అనుకుంటున్నార..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా..

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Mar 13, 2025 | 6:30 PM

మన హీరోలు పాత రోజుల్లోకి వెళ్తున్నారు.. దర్శకుల్లోనూ ఈ మార్పు కనిపిస్తుంది. సుకుమార్, రాజమౌళి లాంటి ఒకరిద్దరు సీనియర్స్ మినహాయిస్తే.. చాలా మంది వర్కింగ్ డేస్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా 100 రోజుల టార్గెట్ పెట్టుకుంటున్నారు. ఈ మధ్యే మజాకా సినిమాను కేవలం 34 రోజుల్లో తీసారు త్రినాథరావు నక్కిన.. ఇక సంక్రాంతికి వస్తున్నాం 79 రోజుల్లో పూర్తైంది.

1 / 5
ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ రికార్డ్ టైమ్‌లోనే పూర్తయ్యాయి. బ్రో సినిమాను కేవలం 53 రోజుల్లో పూర్తి చేశారు సముద్రఖని.. అందులో పవన్ ఇచ్చిన డేట్స్ కేవలం 22 రోజులు మాత్రమే. అలాగే దానికి ముందు భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సైతం కేవలం 50 రోజుల్లోపే షూటింగ్ పూర్తయ్యాయి. తాజాగా ఓజి కోసం ఎక్కువ టైమేం తీసుకోలేదు పవర్ స్టార్.

2 / 5

RC16 వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు బుచ్చిబాబు. ఈ మధ్యే షూటింగ్ మొదలైంది.. కుదిరితే ఆర్నెళ్ళలోపే టాకీ పూర్తి చేసి.. డిసెంబర్ నాటికి రిలీజ్ చేయాలనేది బుచ్చిబాబు ప్లాన్.

3 / 5
అలాగే బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 కోసం 70 రోజులే డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్. ఇక ఏ సినిమాకైనా 60 రోజులే.. మరీ కావాలంటే 90 రోజులే అంటున్నారు ప్రభాస్. దానికి మించి ఒక్కరోజు ఇచ్చేదే లేదంటున్నారీయన.

4 / 5
సలార్, కల్కి లాంటి భారీ సినిమాలు తక్కువ రోజుల్లోనే తీసారు దర్శకులు. అలాగే తాజాగా హను సినిమాను ఫాస్టుగానే పూర్తి చేస్తున్నారు ప్రభాస్. స్పిరిట్ కోసం మూడు నెలల బల్క్ డేట్స్ ఇస్తున్నారు రెబల్ స్టార్. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులకు మినహాయిస్తే.. మరే దర్శకుడికి ఏళ్ళ పాటు డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరు మన హీరోలు. ఒకందుకు ఇది కూడా మంచికే.

5 / 5
Follow us