- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi and Anil Ravipudi movie may have Aditi Rao Hydari as heroine
చిరంజీవి, అనిల్ సినిమాలో హీరోయిన్‌గా ఆ హాట్ బ్యూటీ.. ఎవరో తెలుసా ??
అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమాకు అన్నీ అలా రెడీ అయిపోతున్నాయి. నేడో రేపో ముహూర్తం పెట్టేసి.. సమ్మర్ తర్వాత సెట్స్‌పైకి తెచ్చేసి.. చూస్తుండగానే సంక్రాంతికి సినిమాను విడుదల చేసేయాలని ఫిక్సైపోయారు ఈ దర్శకుడు. అంతా బాగానే ఉంది గానీ అనిల్, చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఎవరు..? ఎవరి వైపు మేకర్స్ అడుగులు పడుతున్నాయి..?
Phani CH |
Updated on: Mar 13, 2025 | 5:28 PM

సీనియర్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు హీరోయిన్ల దగ్గరే దర్శకుల జోరుకి బ్రేకులు పడుతున్నాయి. దాంతో ఆప్షన్ లేక తమన్నా, నయనతార, త్రిష అంటూ అక్కడక్కడే తిరుగుతున్నారు సీనియర్లు.

ప్రస్తుతం విశ్వంభర సినిమాలోనూ త్రిషతోనే జోడీ కడుతున్నారు చిరు. నెక్ట్స్ అనిల్ రావిపూడి సినిమా కోసం ఇప్పట్నుంచే హీరోయిన్ల వేట మొదలైంది. విశ్వంభర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది.

ప్రస్తుతం ఒక్క పాట బ్యాలెన్స్ ఉందంతే. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు చిరు. సమ్మర్ తర్వాత ఇది సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా అదితి రావు హైదరీ పేరు పరిశీలనలో ఉంది.

ఈమెతో పాటు ఐశ్వర్యా రాజేష్, శృతి హాసన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. తన సినిమాల్లో స్టార్ హీరోయిన్సే ఉండాలని పట్టుబట్టే దర్శకుడు కాదు అనిల్ రావిపూడి. కథకు తగ్గట్లే తీసుకుంటారీయన.

సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్‌ను అలాగే తీసుకున్నారు. గ్లామర్ కోసం మీనాక్షిని సెలెక్ట్ చేసారు. తాజాగా చిరంజీవి సినిమాలోనూ ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు అనిల్. ఓ సీనియర్ హీరోయిన్.. ఓ గ్లామర్ బ్యూటీ వైపు అడుగులు పడుతున్నాయి.





























