- Telugu News Photo Gallery Cinema photos Mirna Menon shared latest sizzling photos goes viral in social media
Mirna Menon: ఈ నెరజాణ సొగసుని చూస్తే జాబిల్లికి చెమటలు పడతాయి.. సిజ్లింగ్ మిర్న..
మిర్నా మీనన్.. కథానాయికగా తమిళం, మలయాళం, తెలుగు చిత్రాలలో నటించింది. అధితి మీనన్‌గా తన సినీ కెరీర్ ప్రారంభించింది ఈ బ్యూటీ. చుడుచెక్కని రూపుతో కుర్రకారును ఫిదా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సోషల్ మీడియా వేదిక కొన్ని ఫోటోలను పంచుకుంది ఈ వయ్యారి. ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి మరి.
Updated on: Mar 14, 2025 | 10:46 AM

15 డిసెంబర్ 1992న కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ఇడుక్కి జన్మించింది అందాల భామ మిర్న మీనన్. ఈ వయ్యారికి సయన సంతోష్, అదితి మీనన్ అనే మరో రెండు పేరు కూడా ఉన్నాయి. మొదటి రెండు సినిమాల్లో అదితి మీనన్ అనే ఉంటుంది.

ఈమె తండ్రి పేరు సంతోష్ కుమార్, తల్లి పేరు శోబనా సంతోష్. ఈ వయ్యారి భామకి ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. కేరళలోని ఇదుక్కిలో రామకల్‌మేడులో ఉన్న సేక్రేడ్ హార్ట్ హైస్కూల్‌లో తన స్కూలింగ్ పూర్తి చేసింది ఈ బ్యూటీ.

తమిళనాడులోని చెన్నైలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజిలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించింది ఈ భామ. మొదట్లో ఫ్రీలాన్స్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. కొచ్చిలో జరిగిన ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై కూడా చేసింది.

2016లో పట్టతారి అనే తమిళ చిత్రంలో కథానాయకిగా చలన చిత్రం అరంగేట్రం చేసింది. 2020లో బిగ్ బ్రదర్ సినిమాతో తొలిసారి మలయాళంలో మెప్పించింది. 2022లో క్రేజీ ఫెలో అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది.

2023లో అల్లరి నరేష్‌కి జోడిగా ఉగ్రంలో కనిపించింది. ఈ సినిమాతో తెలుగులో తొలి విజయాన్ని అందుకుంది. అదే ఏడాది జైలర్‌లో తలైవా కోడలిగా కనిపించి మరో విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది నా సామీ రంగలో మరోసారి అల్లరి నరేష్ సరసన మెప్పించింది.





























