సుభాష్ రెడ్డి తన స్వంత జిల్లాలోని వంద గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తన సొంత నిధులతో ఫర్నిచర్ విరాళంగా ఇచ్చారు. చిన్న పంచాయతీలకు లక్ష రూపాయలు, మేజర్ పంచాయతీలకు రెండు లక్షల రూపాయల చొప్పున బల్లలు, కుర్చీలు, సోఫాలు అందించారు. పార్టీలకతీతంగా అవసరమున్న అన్ని పంచాయతీలకు ఈ సహాయం అందించారు.