AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Broccoli: బ్రోక‌లీ రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..? పంబరేపే బెనిఫిట్స్..

బ్రోకలీ పోషకాల పవర్‌హౌస్. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఈ కూరగాయ క్యాన్సర్‌ను నివారించి, కాలేయాన్ని రక్షిస్తుంది. ఎముకలను బలోపేతం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడి, రక్తపోటును నియంత్రిస్తుంది. బ్రోకలీ సంపూర్ణ ఆరోగ్యానికి కీలకమైన ఆహారం.

Broccoli: బ్రోక‌లీ రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..? పంబరేపే బెనిఫిట్స్..
Broccoli
Jyothi Gadda
|

Updated on: Dec 20, 2025 | 9:51 PM

Share

చూసేందుకు కాలీఫ్లవర్ లాగా కనిపించే బ్రోకలీ పోషకాల పవర్‌ హౌస్‌. ఆకుపచ్చ కూరగాయలో ఒకటైన బ్రోకలీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యంతో పాటు అందానికి కూడా అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉంటే సల్ఫోరఫేన్ అనే సమ్మేళనం ఫ్రీ రాడికల్స్ వల్ల శరీర కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. తద్వారా క్యాన్సర్ వంటి మహమ్మారి రాకుండా అడ్డుకోవచ్చు.

బ్రోకలీలో గ్లుకోసినోలేట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. తద్వారా కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. బ్రోకలీలో కాల్షియం, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలకు కావాల్సినంత బలం అందిస్తాయి. తద్వారా వయసు పెరిగినా ఎముకలు బలంగా ఉంటాయి. బ్రోకలీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు.

బ్రోకలీలో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకం ఏర్పడకుండా కాపాడుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. అయితే పచ్చిగా తింటే మాత్రం జీర్ణ సమస్యలు వస్తాయి. బ్రోకలీలో పొటాషియం, ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి గుండెకు మేలు చేసే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు అదుపులో ఉంచి హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది