AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coriander benefits: కొత్తిమీరే కదా అని లైట్ తీసుకుంటున్నారా..? ఆరోగ్యానికి దివ్యౌషధం..!

కొత్తిమీర ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెర, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు కూడా ఇందులో ఉన్నాయి. జీర్ణ సమస్యలకు, దంత నొప్పులకు కూడా కొత్తిమీర అద్భుత ఔషధం. దీన్ని రోజువారీ ఆహారంలో సులువుగా చేర్చుకోవచ్చు.

Coriander benefits: కొత్తిమీరే కదా అని లైట్ తీసుకుంటున్నారా..? ఆరోగ్యానికి దివ్యౌషధం..!
Coriander
Jyothi Gadda
|

Updated on: Dec 20, 2025 | 9:40 PM

Share

ప్రతి వంటలోనూ చివరకు తప్పనిసరిగా వేసేది కొత్తిమీర. కొత్తిమీర ఆకు ఆహారం రుచి, వాసనను పెంచుతుంది. కేవలం రుచి, సువాసన మాత్రమే కాదు..ఆరోగ్యానికి, శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంది కొత్తిమీర. ఆయుర్వేదంలో కొత్తిమీరను ఔషధంగా పరిగణిస్తారు. కొత్తిమీర ఆకులలో విటమిన్ సి,విటమిన్ ఏ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు మొక్కల ఆధారిత సమ్మేళనాలు మీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. దృష్టిని మెరుగుపరుస్తుంది. ధనియాలలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రెటీనాకు పోషణనిస్తుంది. తద్వారా కళ్ళనుతేమగా ఉంచడంలో సహాయపడుతుంది.

కొత్తిమీర మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెరను గణనీయంగా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కొత్తిమీర ఆకులలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సమ్మేళనాలు ఉన్నాయి. కొత్తిమీరలో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు. కొత్తిమీర తినడం వల్ల దృష్టి మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధమనే చెప్పాలి.

కొత్తిమీరను వినియోగించడం చాలా సులువు. నేరుగా ఆకులు తినొచ్చు. ప్రతి కూరపై నుంచి జల్లుకోవచ్చు. కొత్తిమీర రైస్ చేసుకోవచ్చు. మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. రసంగా తాగొచ్చు. గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్న వారికి కొత్తిమీర రసం వాటి నుంచి ఉపశమనం ఇస్తుంది. కొత్తిమీర ఆకులను కషాయంగా చేసి పుక్కిలిస్తే చిగుళ్ల నొప్పులు, దంతాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్