ఉద్యోగం చేసే మహిళలు ఎదుర్కొనే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యూటీఐ) ప్రాణాంతకం కావచ్చు. మూత్రాన్ని గంటల తరబడి ఆపుకోవడం వల్ల ఓ కార్పొరేట్ ఉద్యోగిని యూటీఐ బారిన పడి మృతి చెందింది. ఈ ఘటన నేపథ్యంలో, మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే ప్రమాదాలు, యూటీఐ లక్షణాలు, నివారణ మార్గాలపై వైద్య నిపుణులు సూచనలు అందిస్తున్నారు.