తేనీటితో మానసిక రుగ్మతలు వస్తాయట.. జర జాగ్రత్త!

20 December 2025

TV9 Telugu

TV9 Telugu

అలవాట్లు, ఇష్టాలు ఏవైనా హద్దుల్లోనే ఉండాలి. లేదంటే అవి తెచ్చే సమస్యలు వర్ణనాతీతం. రోజూ ఉదయం మనల్ని పలకరించే చాయ్‌కి కూడా ఇది వర్తిస్తుంది

TV9 Telugu

అసలే శీతకాలం... వేడివేడిగా టీ, కాఫీ తాగితే వచ్చే ఉత్తేజం మాటల్లో చెప్పలేం. అందుకే నిద్ర లేచాక ఒక కప్పు టీతోనే మొదలవుతుంది మహిళల రోజు

TV9 Telugu

ఇలా ఉదయం, సాయంత్రం, మహా అయితే అలసట ఎక్కువైనప్పుడో ఓ కప్పు టీ తాగితే పర్వాలేదు కానీ... కొంతమంది చాలాసార్లు తాగుతుంటారు

TV9 Telugu

వీటన్నింటివల్లా శరీరంలో కెఫీన్‌ స్థాయులు ఎక్కువవుతున్నాయి. మానసిక సమస్యలు దీని పర్యవసానమే అంటున్నారు నిపుణులు. ప్రశాంతత, నిద్రను ప్రోత్సహించే అడెనోసిన్‌ గ్రాహకాలను అడ్డుకుంటుంది కెఫీన్‌

TV9 Telugu

దాంతో నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు. హృదయ స్పందన రేటు మీదా దీని ప్రభావం పడుతుందట. టీ తయారీలో వాడే పాలు, చక్కెర జీవక్రియా రేటుని దెబ్బతీస్తాయి

TV9 Telugu

దాంతో అజీర్తి, ఉబ్బరం వంటి జీర్ణసంబంధిత సమస్యలూ పెరుగుతాయి. పైగా, ఇప్పటికే యాంగ్జయిటీతో బాధపడుతున్నవారు టీ ఎక్కువగా తాగడం వల్ల అందులోని కెఫీన్‌ నాడీ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది

TV9 Telugu

పర్యవసానంగా... మానసిక రుగ్మతలు ఇంకా పెరుగుతాయి. అందుకే రోజుకు కెఫీన్‌ పరిమితి 400మి.గ్రా.కి మించకూడదంటున్నారు నిపుణులు

TV9 Telugu

వయసును బట్టీ దీనిలో మార్పులు ఉంటాయట. గర్భిణులు, యాంగ్జయిటీ సమస్యలున్న వారు అయితే 200మి.గ్రా.కి మించకుండా చూసుకోవాలట. గమనించుకుంటారుగా మరి