హుండీలే కాదు.. విగ్రహాలనూ ఎత్తేస్తున్నారు? వీడియో
సాధారణంగా ఇళ్లలో, దుకాణాల్లో చోరీలకు పాల్పడటం సహజంగా మనం చూస్తుంటాం. ఇక ఆలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లడం కూడా చూశాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన దొంగలు హుండీలను పక్కన పెట్టి విలువైన దేవతా విగ్రహాలపై ఫోకస్ చేశారు. హుండీ ఎత్తుకెళ్తే చిల్లరే దొరుకుతుంది.. విగ్రహాలైతే గిట్టుబాటు అవుతుంది అనుకున్నారో ఏమో ఓ ఆలయంలో భక్తులుగా వచ్చిన కొందరు మహిళలు ఆ గుడిలోని దేవుడిపై కన్నేశారు.. గర్భగుడిలోకి ప్రవేశించి దేవునికి మొక్కుతున్నట్టే మొక్కి అక్కడి పంచలోహ విగ్రహాలను సంచిలో సర్దుకొని వెళ్లిపోయారు.
ఈ ఘటన హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లో జరిగింది. ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తి నగర్ లోని శ్రీ వినాయక దేవాలయం ఉంది. ఆ ఆలయంలోని అర్చకుడు నవీన్ కుమార్ మార్చ్ 8న ఉదయాన్నే ఆలయానికి వచ్చి.. పూజలు చేసేందుకు ఆలయంలోని ఉపాలయమైన శివాలయ గర్భగుడి తలుపులు తెరిచాడు. రోజూ మాదిరిగానే పూజలు చేస్తూ.. వచ్చిన భక్తులకు అర్చనలు చేస్తూ గర్భ గుడిలో భక్తుల చేత అభిషేకాలు చేయిస్తున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి వెళ్లి వచ్చిన పూజారికి శివాలయం గర్భ గుడిలో ఉన్న పంచ లోహ విగ్రహాలు కనిపించలేదు. దీంతో కంగారు పడ్డ పూజారి ఆలయ ఈఓ నరేందర్ రెడ్డి కి విషయం చెప్పాడు. అనంతరం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు.
మరిన్ని వీడియోల కోసం :
బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్!
విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం
నల్లగొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ కేసులో ఏం జరిగిందంటే వీడియో
అమెరికాలో సుదీక్ష మిస్సింగ్.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
