Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబాయ్‌లో బంగారం ఎందుకు చవక? ఎంత బంగారం తెచ్చుకోవచ్చు?

దుబాయ్‌లో బంగారం ఎందుకు చవక? ఎంత బంగారం తెచ్చుకోవచ్చు?

Samatha J

|

Updated on: Mar 16, 2025 | 7:24 PM

భారత్‌లోకి బంగారం స్మగ్లింగ్‌ ఎక్కువగా దుబాయ్‌ నుంచే జరుగుతుంది. కారణం ఏంటి? ధర ఎందుకు అక్కడ తక్కువ? తాజాగా కన్నడ నటి రన్యారావు దుబాయ్‌ నుంచి 14 కిలోల బంగారాన్ని తరలిస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ అయ్యారు. బంగారం స్మగ్లింగ్‌ జరగకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, తరలింపు మాత్రం ఆగడం లేదు. దుబాయ్‌లో నివసిస్తున్న వారెవరైనా భారత్‌కు వస్తున్నారని తెలిస్తే.. తెలిసినవారు, కుటుంబసభ్యులు అడిగే ప్రశ్న.. ‘వచ్చేటప్పుడు బంగారం ఏమైనా తేవడం సాధ్యమవుతుందా?’

 అని. ఎందుకంటే మన దేశంతో పోలిస్తే అక్కడ బంగారం ధర తక్కువగా ఉండడమే కారణం. ఈ కారణం చేత ఎంతోకొంత మిగులుతుంది కదా అని ఆరాటపడుతుంటారు. కొందరు అత్యాశకు పోయి అక్రమ రవాణా మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. దీంతో దొరికిన వాళ్లు వార్తల్లో నిలుస్తుంటారు. దొరకని వాళ్లు దర్జాగా బయటపడుతుంటారు.భారత్‌తో పోలిస్తే పసిడి ధర దుబాయ్‌లోనే తక్కువ. అక్కడ బంగారం కొనుగోళ్లపై ఎలాంటి పన్నూ ఉండదు. కాబట్టి ఎలాంటి అదనపు సుంకాలు చెల్లించకుండానే మార్కెట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు. భారత్‌లా దిగుమతి సుంకం విధించకపోవడమే ఇందుకు కారణం. దుబాయ్‌లో వ్యాపారుల మధ్య పోటీ కారణంగా అక్కడ పెద్దఎత్తున ఆఫర్లు ఇస్తుంటారు. ఈ కారణంగా బంగారం తక్కువకు లభిస్తుంది. ప్రభుత్వం విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సుంకాలను భారీగా తగ్గించింది. గతేడాది బడ్జెట్‌లో 15 శాతంగా ఉన్న కస్టమ్స్‌ సుంకాన్ని కేంద్రం 6 శాతానికి తగ్గించింది. దీంతో అప్పట్లో బంగారం ధర దేశీయంగా దాదాపు రూ.4 వేల వరకు తగ్గింది.

మరిన్ని వీడియోల కోసం :

బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్‌!

విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం

నల్లగొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ కేసులో ఏం జరిగిందంటే వీడియో

అమెరికాలో సుదీక్ష మిస్సింగ్‌.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో