AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Nakshatra Gochar: ఈ నెల 15న శతభిషా నక్షత్రంలో శని ప్రవేశం.. ఈ ఆరు రాశులవారు పట్టిందల్లా బంగారమే..

శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఏడాది పొడవునా ఈ రాశిలో శనీశ్వరుడు సంచరించనున్నాడు. అక్టోబరు 17 వరకు శనీశ్వరుడు శతభిషా నక్షత్రం మొదటి దశలో ఉంటాడు. శని నక్షత్రం మారడం వల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో చాలా లాభాలు, సుఖ సంతోషాలు లభిస్తాయి.

Shani Nakshatra Gochar: ఈ నెల 15న శతభిషా నక్షత్రంలో శని ప్రవేశం.. ఈ ఆరు రాశులవారు పట్టిందల్లా బంగారమే..
Shani Nakshatra Gochar
Surya Kala
|

Updated on: Mar 10, 2023 | 8:17 AM

Share

మార్చి 15, 2023న శనీశ్వరుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. శనీశ్వరుడు ఈ రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శతభిషా నక్షత్రం మొత్తం 27 నక్షత్రాల్లో 24వ శతభిషా నక్షత్రం. ఈ నక్షత్రంలో శనీశ్వరుడు ఉండటం మంచిదని భావిస్తారు. శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు.. ఏడాది పొడవునా ఈ రాశిలో సంచరించనున్నాడు. అక్టోబరు 17 వరకు శనిదేవుడు శతభిషా నక్షత్రం మొదటి దశలో ఉంటాడు. శని నక్షత్రం మారడం వల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో చాలా లాభాలు, సుఖ సంతోషాలు లభిస్తాయి..

మేష రాశి: మేష రాశి వారికి శనీశ్వరుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడం ఏ విధంగా చూసినా వరం కంటే తక్కువ కాదు. అనేక శుభాలను తెస్తుంది. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్ధిక లాభాలకు అద్భుతమైన అవకాశాలు ఏర్పడతాయి.

మిధున రాశి: ఈ రాశివారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. డబ్బులు సంపాదించేందుకు మంచి అవకాశం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అన్ని విధాలా మంచి జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

సింహ రాశి:  శనీశ్వరుడు నక్షత్ర మార్పు వ్యాపార, ఉద్యోగస్తులకు అనుకూలమైన అవకాశాలను అందిస్తుంది. ఆర్థిక లాభం కోసం ఉత్తమ అవకాశాన్ని పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. భవిష్యత్తు కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది.

తుల రాశి: మీకు శుభం కలుగుతుంది. కెరీర్‌లో మంచి విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన అన్ని రకాల వివాదాలు పరిష్కరించబడతాయి. కార్యాలయంలో మంచి ఫలితాలు సాధిస్తారు.

ధనుస్సు రాశి: శనీశ్వరుడు నక్షత్ర మార్పు ఈ రాశివారికి శుభం, ఫలప్రదం. ఉద్యోగంలో మంచి మరియు సానుకూల ఫలితాలను పొందుతారు. వీరి  ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. ప్రమోషన్ అవకాశాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మకర రాశి: ఈ రాశి వారికి శనీశ్వరుడు నక్షత్ర మార్పు మంచిది. డబ్బు ఆకస్మికంగా అందుతుంది. ఉద్యోగస్తులకు ప్రతి విషయంలోనూ  ఈ మార్పు  శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు కష్టపడి మంచి లాభాలను పొందుతారు. క్షేత్ర స్తాయిలో విజయాలు సాధిస్తారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)