Kuruba Jatara: వైభవంగా కురువ జాతర.. తలమీద కొబ్బరి కాయలు కొట్టించుకున్న భక్తులు, పూజారులు

అచ్చం ఇలాంటి సీనే చిత్తూరు జిల్లాలోనూ దర్శనమివ్వడం ఆశ్చర్యపరుస్తోంది. రీల్‌ మీద చూసేందుకే ఒళ్ల జలదరించిపోయింది..

Kuruba Jatara: వైభవంగా కురువ జాతర.. తలమీద కొబ్బరి కాయలు కొట్టించుకున్న భక్తులు, పూజారులు
Kuruba Jatara
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2023 | 6:47 AM

ఆలయాల్లో టెంకాయలు కొట్టడం కామన్‌. కాకపోతే వాటిని బండకేసో, రాయికేసో కొడితే ఓకే.. మనుషుల తలకాయల మీద కొడితే మాత్రం అది కచ్చితంగా సెన్సేషన్‌. అలాంటి ఆచారమే ఒకటి… చిత్తూరు జిల్లాలో ఉందట. ఆ ఆచారం ఏమిటి? తెలుసుకుందాం.. అరుంధతి సినిమాలోని ఈ సీన్‌ గుర్తుందా…? తలమీద టపాటపా అంటూ కొబ్బరికాయలు కొట్టే ఈసీన్‌.. అంత ఈజీగా మరిచిపోయేదేం కాదులేండి. అయితే, అచ్చం ఇలాంటి సీనే చిత్తూరు జిల్లాలోనూ దర్శనమివ్వడం ఆశ్చర్యపరుస్తోంది. రీల్‌ మీద చూసేందుకే ఒళ్ల జలదరించిపోయింది.. ఇక రియల్‌ లైఫ్‌లో ఇలాంటి సీనంటే, అదీ డైరుక్టుగా చూస్తుంటే ఎట్టుంటాది ఒక్కసారి ఆలోచించండి..

ఇంతకీ, ఇది యాడంటే… చిత్తూరు జిల్లా గంగవరం మండలం బీరగాని కురప్పల్లిలోని నిడిగుంట బీర లింగేశ్వరస్వామి శ్రీ ఉజ్జయినీ రాయస్వామి వసరాయస్వామి సన్నిధిలో జరిగింది. కురవవర్గం… తమ ఆరాధ్యదైవంగా భావించే ఈ స్వామివారికి ఈనెల 10 నుంచి 13వరకు మమామంగళ పూజలు నిర్వహించారు. అందులో భాగంగానే.. ఈ ఆసక్తికరమైన సీన్‌ కనిపించింది.

ఈ పూజల్లో భాగంగా.. పూజారుల తలలపై టెంకాయ కొట్టడం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే పూజారులంతా వరుసబెట్టి కూర్చుని ఉంటే..వారి తలపై  టెంకాయలు కొడుతుంటారన్నమాట. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నా.. ఇదిక్కడి ఆచారం. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ తంతు.. చూసేందుకు ఆశ్చర్యం కలిగించినా, కాస్త భయానకంగా అనిపించినా.. వీళ్లకిదంతా కామన్‌. దైవకార్యంలో భాగమే. ఇలా చేయడం వల్ల తమకంతా మంచే జరుగుతుందన్నది వీళ్ల ప్రగాఢ విశ్వాసం.

ఇవి కూడా చదవండి

అయితే, టెక్నాలజీలో అంతరిక్షాన్ని దాటేసిన మనుషులు.. ఇంకా ఇలాంటి మూఢ నమ్మకాలు కూడా విశ్వసించడమేంటని ప్రశ్నించేవారూ లేకపోలేదు. ఇక, ఇదంతా దేవుడి లీల.. ఆయన ముందు మనమెంత? అనేవారూ ఉన్నారు. అంతా, బాగా జరిగితే ఓకే, ఏదైనా తేడా కొడితేనే డేంజర్‌ అంటున్నారు మరికొందరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..