Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. మధ్యాహ్నం జూన్ నెల శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
స్వామివారి దర్శనం కోసం టికెట్లను బుక్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నేడు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల చేయనుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల్లోని భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం టికెట్లను బుక్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నేడు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. అంతేకాదు శ్రీవారి సేవకు సంబంధించిన పలు టికెట్లను వరసగా వివిధ తేదీల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మార్చి 23న శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు:
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి. అదేవిధంగా, జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి 24న ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
అంగప్రదక్షిణం టోకెన్లు:
జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా:
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు ఆయా సేవలను గమనించి తమ టికెట్లను బుక్ చేయసుకోవాలని టీటీడీ సిబ్బంది కోరింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..