Morning Mistakes: ఉదయం నిద్ర లేవగానే మర్చిపోయి కూడా ఈ పనులు చేయకండి.. లేదంటే చిన్న వయసులోనే..
ఉదయాన్ని ఆరోగ్యకరమైన పనులతో ప్రారంభిస్తే రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఐతే మన ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలామంది హాని తలపెట్టే చెడు అలవాట్లతో తమ రోజును ప్రారంభిస్తున్నారు. మన..
ఉదయాన్ని ఆరోగ్యకరమైన పనులతో ప్రారంభిస్తే రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఐతే మన ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలామంది హాని తలపెట్టే చెడు అలవాట్లతో తమ రోజును ప్రారంభిస్తున్నారు. మన రోజువారీ చెడు అలవాట్లు మనపై తక్షణ ప్రభావం చూపకపోవచ్చు. కానీ అవి తర్వాత మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావితం చూపుతాయి. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే చేయకూడదని పనులు, చేయవల్సిన పనులు కొన్ని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముందు అవేంటో తెలుసుకుందాం..
ధ్యానం
ప్రస్తుత కాలంలో టెక్నాలజీకి మనమెంత బానిసలమైపోయామో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీంతో ఉదయం నిద్రలేవగానే బెడ్‌పై పడుకునే సెల్ ఫోన్‌లో సోషల్ మీడియాను చూడటం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం చేయవలసిన మొదటి పని కనీసం 10-15 నిమిషాల పాటు ధ్యానం చేయడం.
అలారం వద్దు వద్దు
అలారం శబ్దంతో నిద్ర మేల్కొలపడం అత్యంత అనారోగ్యకరమైన అలవాట్లలో ఒకటి. ఇది మానసికంగా మనం రోజు కోసం సిద్ధం కావడానికి మరియు సిద్ధంగా ఉండటానికి సమయాన్ని వెచ్చించే సమయాన్ని తగ్గిస్తుంది. అలారం స్ట్రెస్ స్థాయిలను పెంచుతుంది. బదులుగా టైంకి నిద్రపోయి, టైంకి నిద్రలేవడం అలవాటు చేసుకుంటే నిద్ర చక్రాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
అల్పాహారం
రాత్రంతా దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తర్వాత తినే తొలిసారి తినేది బ్రేక్‌ఫాస్ట్. ఎక్కువ సమయం ఆకలితో ఉండడం వల్ల దీర్ఘకాలంలో మన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందువల్ల ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి.
న్యూస్ పేపర్ రీడింగ్
ఉదయం నిద్రలేచాక న్యూస్ పేపర్ చదివడం అలవాటు చేసుకోవాలి. ఎంతో మంది ప్రముఖులు ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తుంటారు. అన్నింటికీమించి మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఉదయకాల వ్యాయామం
ఉదయాన్నే వ్యాయామం చేయడం దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కేవలం 15-30 నిమిషాల పాటు చెమట పట్టేలా ఉదయం పూట వ్యాయామం చేయడం మంచిది.
గ్లాస్ నీళ్లు తాగాలి
ఉదయాన్నే మనం పాటించాల్సిన ముఖ్యమైన అలవాట్లలో నీళ్లు తాగడం ఒకటి. ఉదయాన్నే తగినంత నీళ్లు తాగితే రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పైగా కడుపులో పేగులు ఆరోగ్యంగా ఉంచడమేకాకుండా జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే సరిపడా నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల నోటి దుర్వాసన, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించవచ్చు.
నో కాఫీ/టీ
ఉదయం 9:30 గంటలలోపు కాఫీ లేదా టీ తాగడం ఆరోగ్యానికి అంతమంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరిశోధన ప్రకారం.. మన శరీరం సహజంగా ఉదయాన్నే ఎక్కువ కార్టిసాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ సమయంలో కాఫీ తీసుకోవడం వల్ల మన సహజ కార్టిసాల్ మానిటరింగ్ సిస్టమ్‌కు అంతరాయం కలుగుతుంది. మధ్యాహ్నం పూట ఓ కప్పు కాఫీ తాగవచ్చు. కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది కాబట్టి శరీరం హైడ్రేట్‌గా ఉండాలంటే కాఫీ తాగేముందు ఓ గ్లాసు నీళ్లు తాగడం మంచిది.
ఖాళీ కడుపుతో స్వీట్లు తినకూడదు
ఏదైనా స్వీట్ తినే ముందు అల్పాహారం తిసుకోవడం మర్చిపోకూడదు. ఖాళీ కడుపుతో స్వీట్లు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా చిన్న వయసులో మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ సమాచారం కోసం క్లిక్ చేయండి.