- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna refuses to dance to Saami Saami step anymore, says 'I'll have issues with my back'
‘బాబోయ్.. ఆ స్టెప్ ఇక వెయ్యలేను’ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న రష్మిక ట్వీట్
అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మువీ ‘పుష్ప’ విడుదలైన అన్ని భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మువీలో ‘సామి సామి’ పాటలో రష్మిక స్టెప్పులు అభిమానులకు..
Updated on: Mar 22, 2023 | 8:55 AM

అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మువీ ‘పుష్ప’ విడుదలైన అన్ని భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

ఈ మువీలో అల్లు అర్జున్ మ్యానరిజం, స్టెప్పులు, డైలాగులు, పాటలు ప్రపంచవ్యాప్తంగా హోరెత్తిపోయాయి. ఈ సినిమాలోని పాటలు మాస్ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేశాయి.

ముఖ్యంగా ‘సామి సామి’ పాటలో రష్మిక స్టెప్పులు అభిమానులకు తెగనచ్చేసింది. దీంతో ఈ సినిమీ విడుదల తర్వాత ఎక్కడకు వెళ్లినా, ఏ ఈవెంట్‌కు హాజరైనా అభిమానులు రష్మికను ‘సామి సామి’ స్టెప్ వేయమని అడిగేవారు. ఆమె కూడా కాదనకుండా అభిమానుల ముచ్చటమేరకు వేస్తూనే వచ్చింది. ఐతే ఇకపై ఆ స్టెప్ వేయలేనని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

‘సామి సామి పాటకు మీతో కలిసి డ్యాన్స్ చేయాలనుకుంటున్నా. చేయొచ్చా అంటూ ఓ అభిమాని రష్మికను అడిగిన ప్రశ్నకు రష్మిక బదులిస్తూ.. ‘సామి సామి’ స్టెప్‌ను ఇప్పటికే ఎన్నోసార్లు చేశా. ఇలాగే ఆ స్టెప్ వేస్తూవుంటే నేను ముసలిదాన్ని అయ్యాక నా నడుములో సమస్యలు వస్తాయేమో. ఆ స్టెప్పే ఎందుకు వేయాలి? మనం కలిసినప్పుడు కొత్తగా వేరే ఏదైనా చేద్దామని సమాధానం ఇచ్చింది.

ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప2ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మువీలో ప్రధానపాత్రలైన రష్మిక, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయతోపాటు మరికొన్ని కొత్త పాత్రలు కూడా దర్శనమిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.





























