Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Less Sleeping: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఐతే మీరీవిషయం తెలుసుకోవాల్సిందే..

నిద్ర విషయంలో చాలా మంది అజాగ్రత్తగా ఉంటుంటారు. ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్లు చేతిలోకొచ్చాక అసలు నిద్రపోవడం మర్చిపోయారంటే అతిశయోక్తికాదేమో. దీంతో నిద్ర సమయం చాలా వరకు తారుమారై పోయిందనే..

Less Sleeping: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఐతే మీరీవిషయం తెలుసుకోవాల్సిందే..
Disadvantages Of Less Sleep
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 22, 2023 | 12:30 PM

నిద్ర విషయంలో చాలా మంది అజాగ్రత్తగా ఉంటుంటారు. ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్లు చేతిలోకొచ్చాక అసలు నిద్రపోవడం మర్చిపోయారంటే అతిశయోక్తికాదేమో. దీంతో నిద్ర సమయం చాలా వరకు తారుమారై పోయిందనే చెప్పాలి. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. సరిగ్గా నిద్రపోకుంటే రోజంతా చిరాగ్గా ఉంటుంది. ఏ పని మీదా శ్రద్ధ పెట్టలేం. అలాగని ఎక్కువ సమయం నిద్రపోతే బద్ధంగా రోజంగా డల్‌గా గడుస్తుంది. అందుకే నిద్ర ఎక్కువగా పోయినా, తక్కువ సమయం నిద్రపోయినా ఇబ్బందులే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రోజులో 5 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో హృదయ సంబంధ వ్యాధులు (గుండె సంబంధిత వ్యాధులు) వచ్చే ప్రమాదం అధికమని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) వృద్ధి చెంది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుందని పేర్కొంది. అంతే కాకుండా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు రావచ్చని తెల్పింది.

పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే..

ఫలకం పేరుకుపోవడం వల్ల చేతులు, కాళ్ళ ధమనులు కుచించుకుపోయి పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వస్తుంది. ఇది అథెరోస్క్లెరోసిస్ ప్రధాన లక్షణాలలో ముఖ్యమైనది. ఇది సంభవిస్తే కాళ్ళు, చేతుల్లోని రక్త నాళాల్లో కొవ్వు నిల్వ ఉండి, రక్తప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కాళ్ళలో తిమ్మిరి, కాళ్లు చల్లగా ఉండటం, కాళ్ళలో పల్స్ బలహీనంగా ఉండటం, పిరుదులలో నొప్పితో కూడిన తిమ్మిర్లు, కాళ్ళపై చర్మం రంగు మారడం, కాళ్ళపై గాయాలు పూర్తిగా నయం కాకపోవడం, కాళ్ళపై జుట్టు రాలడం.. వంటివి ఈ డిసీజ్‌ లక్షణాలు.

దాదాపు 6.50 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో తక్కువ సమయం నిద్ర పోయినవారిలో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ప్రమాదం పెరుగుతున్నట్లు పరిశోధనలో తేలింది. రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులకు అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం వచ్చే అవకాశం ఉందని ఇతర అధ్యనాల్లో కూడా బయటపడింది. ఈ లక్షణాలన్నీ గుండె జబ్బులకు దారితీస్తాయి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ మొదలై రక్త నాళాలను దెబ్బతీసి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల గుండె ఆరోగంగా ఉండాలంటే ప్రతి రోజూ 7-8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.