AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: ‘నా శత్రువులకు థ్యాంక్స్‌.. కష్టాల్లో పోరాడటం నేర్పించారు’.. బాలీవుడ్ క్వీన్‌ బర్త్‌ డే

చెప్పదల్చుకున్న విషయాన్ని ఏమాత్రం మొహమాటపడకుండా ముఖం మీదే చెప్పే నటీనటుల్లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ముందుంటారు. దీంతో వరుస వివాదాల్లో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ఈ బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌..

Kangana Ranaut: 'నా శత్రువులకు థ్యాంక్స్‌.. కష్టాల్లో పోరాడటం నేర్పించారు'.. బాలీవుడ్ క్వీన్‌ బర్త్‌ డే
Kangana Ranaut
Srilakshmi C
|

Updated on: Mar 23, 2023 | 8:42 PM

Share

చెప్పదల్చుకున్న విషయాన్ని ఏమాత్రం మొహమాటపడకుండా ముఖం మీదే చెప్పే నటీనటుల్లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ముందుంటారు. దీంతో వరుస వివాదాల్లో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ఈ బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌. గురువారం (మార్చి 23) తన 36వ పుట్టినరోజు జరుపుకున్న ఈ బ్యూటీ తన అభిమానులు, ఫాలోవర్స్‌తో పాటు శత్రువులకు ‘థ్యాంక్స్‌’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తన మాటల వల్ల ఎవరినైనా బాధపెట్టివుంటే క్షమించాలని కూడా కోరారు. ఇందుకు సంబంధించిన వీడియోను నటి కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నా పుట్టిన రోజునాడు మనసులో నుంచి వచ్చిన మాటలు అనే క్యాప్షన్‌తో..

“నా పుట్టినరోజు సందర్భంగా నా తల్లిదండ్రులు, మాకుల దైవం, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాతో కలిసి పనిచేస్తున్న వారితోపాటు నన్నెప్పుడూ విశ్రాంతి తీసుకోనివ్వని నా శత్రువులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎన్ని విజయాలు సాధించినా నాకు కష్టపడటం నేర్పించారు. పోరాడటం నేర్పించారు. వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాను. సానుకూల ఆలోచనలు కలిగి ఉండటం ఆశీర్వాదంగా భావిస్తాను. ఫ్రెండ్స్‌.. నా భావజాలం, ప్రవర్తన చాలా సరళమైనది. ఎల్లప్పుడూ అందరికీ మంచి జరగాలని మాత్రమే కోరుకుంటాను. కొన్నిసార్లు దేశ సంక్షేమం కోసం మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారందరికీ క్షమాపణ చెబుతున్నాను. మీ అందరిపట్ల నాకు అభిమానం, సానుకూల ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. ఎవరి పట్లా ఎలాంటి ద్వేషం లేదు’ అని కంగనా తన వీడియోలో తెలిపారు. కాగా కంగనా నటించిన ధకడ్, తలైవి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో విడుదలకానున్న ఎమర్జెన్సీ మువీలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.