- Telugu News Photo Gallery Cinema photos Niharika Konidela Shares Post Amid Divorce Rumors with her Husband Chaitanya JV
Niharika Konidela: భర్తతో విడాకుల రూమర్స్.. వైరలవుతోన్న నిహారిక లేటెస్ట్ పోస్ట్
మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్య వివాహం 2020లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. చూడముచ్చటగా ఉండే ఈ జంట పార్టీలు, ఫంక్షన్లకు ఎక్కడికి వెళ్లినా జంటగా హాజరవుతుంటారు. ఐతే గత కొన్ని రోజులుగా నిహారిక-చైతన్యలు తమ సోషల్ మీడియా..
Updated on: Mar 23, 2023 | 3:23 PM

మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్య వివాహం 2020లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. చూడముచ్చటగా ఉండే ఈ జంట పార్టీలు, ఫంక్షన్లకు ఎక్కడికి వెళ్లినా జంటగా హాజరవుతుంటారు.

ఐతే గత కొన్ని రోజులుగా నిహారిక-చైతన్యల విడాకుల రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య విబేధాలు ఉన్నయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పైగా వీరిద్దరూ తమ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పెళ్లి ఫోటోలన్నింటిని చైతన్య తన ఖాతా నుంచి డిలిట్ చేసేయడంతో ఈ వందతులకు మరింత ఊతమిచ్చాయి.

ఈ విడాకుల వార్తల నేపథ్యంలో నిహారిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. 'డెడ్ పిక్సెల్స్' పేరుతో తన కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రోమోను అందులో షేర్ చేసింది. దీనిని నిహారిక నిర్మించడమే కాకుండా అందులో నటిస్తోందట.

'కొత్త సంవత్సరం.. కొత్త అనౌన్స్‌మెంట్.. డెడ్ పిక్సెల్‌ను ఎనౌన్స్ చేయడం ఎగ్జైటెడ్‌గా ఉంది. డిస్నీ ప్లస్‌స్టెల్‌లో త్వరలో మీముందుకొస్తుందంటూ' తన పోస్టులో రాసుకొచ్చింది.




