AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: రవితేజ ఫ్యామిలీ నుంచి నయా హీరో.. మాస్ రాజా తమ్ముడి కొడుకు ఎంట్రీ

పెళ్లి సందD చిత్రంతో కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు..

Ravi Teja: రవితేజ ఫ్యామిలీ నుంచి నయా హీరో.. మాస్ రాజా తమ్ముడి కొడుకు ఎంట్రీ
Ravi Teja
Rajeev Rayala
|

Updated on: Mar 23, 2023 | 7:05 PM

Share

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయింది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఈ చిత్రం రూపొందబోతోంది. పెళ్లి సందD చిత్రంతో కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత డి సురేష్ బాబు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరుల ఆశిస్సులతో పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రారంభమైంది. దర్శకులు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ ను అందజేయగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ .. ‘నా తల్లి దండ్రులకు, మా గురువు గారు కే రాఘవేంద్రరావు గారికి థ్యాంక్యూ సో మచ్. ఓ రకంగా ఇది నా సెకండ్ డెబ్యూ మూవీగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మమ్మల్ని దీవించడానికి వచ్చిన మా గురువుగారు, సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను.. మా హీరో మాధవ్ ను నమ్మినందుకు నిర్మాత రవిచంద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. వారు చెప్పినట్టుగా ఇది చాలా యూత్ ఫుల్ గా సాగే కలర్ ఫుల్ గా ఉండే సినిమా. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు ఈ కథ విని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ తో సపోర్ట్ గా నిలుస్తున్నారు అనుకుంటున్నాను. ఇక నా గత చిత్రం లాగానే మీడియా సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను.. ’ అన్నారు.

హీరో మాధవ్ మాట్లాడుతూ.. ‘అందరికీ చాలా థ్యాంక్యూ. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ చిత్రం విడుదలయ్యేంత వరకూ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఇక్కడి వచ్చిన అందరికీ థ్యాంక్యూ సో మచ్’ అన్నారు. త్వరలోనే హీరోయిన్ తో పాటు ఇతర నటీ నటుల వివరాలు తెలియజేయబోతోన్న ఈచిత్రానికి సాంకేతిక నిపుణులు.

Wishing my boy #Maadhav all the very best for his debut :))))