AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ నటికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన కోర్టు.. అసలేం జరిగిందంటే..

జులై 25న మహాబలిపురం నుంచి చెన్నైకి తిరిగి వస్తుండగా ఈసీఆర్‌లోని సులేరికాడు సమీపంలో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో యాషిక ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యాషిక కాలు ఫ్రాక్చర్ కాగా, ఆమె స్నేహితురాలు వల్లి చెట్టి భవాని (28) అక్కడికక్కడే మృతి చెందింది..

ప్రముఖ నటికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన కోర్టు.. అసలేం జరిగిందంటే..
Actress Yashika Anand
Srilakshmi C
|

Updated on: Mar 23, 2023 | 6:24 PM

Share

వేగంగా కారునడిపి ఒకరి మృతికి కారణమైన కేసులో ప్రముఖ కోలీవుడ్‌ నటి యాషికా ఆనంద్‌కు కోర్టు గురువారం (మార్చి 23) అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. రెండేళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని తమిళనాడులోని  చెంగల్‌పట్టు కోర్టు పీడీ వారెంట్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో నటి యాషిక విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

కాగా 2021లో జులై 25న మహాబలిపురం నుంచి చెన్నైకి తిరిగి వస్తుండగా ఈసీఆర్‌లోని సులేరికాడు సమీపంలో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో యాషిక ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యాషిక కాలు ఫ్రాక్చర్ కాగా, ఆమె స్నేహితురాలు వల్లి చెట్టి భవాని (28) అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో యాషిక వాహనం నడిపింది. ఐపీసీ సెక్షన్ 304 ఎ సహా 3 సెక్షన్ల కింద నటిపై కేసు నమోదైంది. ఈ కేసులో మార్చి 21న వ్యక్తిగతంగా హాజరుకావాలని చెంగల్‌పట్టు కోర్టు ఆదేశించింది. నటి హాజరుకాకపోవడంతో తదుపరి విచారణకైనా వచ్చే నెల (ఏప్రిల్‌) 25న హాజరుకావాలని, ఆ రోజు కూడా హాజరు కాకపోతే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఈసారి కూడా యాషిక కోర్టు విచారణకు హాజరుకాకపోతే పోలీసులు ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌