AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karimnagar: జగిత్యాలలో విషాదం.. గోదారిలో దూకి ఇంటర్‌ విద్యార్ధిని ఆత్మహత్య

పరీక్షలు బాగా రాయలేదనే మనస్తాపంతో ఇంటర్ విద్యార్ధిని కాల్ల నాగలక్ష్మి(16) బుధవారం గోదావరి నదిలో ఆత్మహత్యకు పాల్పడింది. పండగపూట నీళ్లలో శవమై తేలిన కూతురు మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి..

Karimnagar: జగిత్యాలలో విషాదం.. గోదారిలో దూకి ఇంటర్‌ విద్యార్ధిని ఆత్మహత్య
Jagityala Inter Student Suicide
Srilakshmi C
|

Updated on: Mar 23, 2023 | 5:30 PM

Share

పరీక్షలు బాగా రాయలేదనే మనస్తాపంతో ఇంటర్ విద్యార్ధిని కాల్ల నాగలక్ష్మి(16) బుధవారం గోదావరి నదిలో ఆత్మహత్యకు పాల్పడింది. పండగపూట నీళ్లలో శవమై తేలిన కూతురు మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కాల్ల రామయ్య, నర్సవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్నకూతురు నాగలక్ష్మి మల్యాల మండలం నూకపెల్లి మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. సోమవారం బోటనీ పరీక్ష రాసిన నాగలక్ష్మి తాను పరీక్ష బాగా రాయలేదని మనస్తాపానికి గురైంది. ఇదే విషయాన్ని తన స్నేహితులతో కూడా తెల్పింది. పరీక్షరాసి ఇంటికి వచ్చినప్పటి నుంచి నాగలక్ష్మి ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. తాను పరీక్ష బాగా రాయలేకపోయానని రోదిస్తూ తెల్పగా, తల్లిదండ్రులు బాలికకు ధైర్యం చెప్పారు.

ఈక్రమంలో బుధవారం ఉగాది పండగకావడంతో ఇంటి ఎదుట ముగ్గులు వేసింది. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లిన నాగలక్ష్మి మధ్యాహ్నమైనా తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులకు సమాచారం అందించారు. గోదావరినది వైపు నాగలక్ష్మి వెళ్లిందని స్థానికులు చెప్పడంతో తల్లిదండ్రులు అటుగా వెళ్లారు. గోదావరి ఒడ్డున నాగలక్ష్మి చెప్పులు కనిపించడంతో బాలిక నదిలో దూకి ఉంటుందనే అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జాలర్లసాయంతో గాలించగా నాగలక్ష్మి మృతదేహం లభ్యమైంది. కూతురు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతిరాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాజు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే