AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP HMFW Recruitment 2023: విజయవాడలో 445 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు.. నేటి నుంచి మార్చి 27 వరకు నేరుగా ఇంటర్వ్యూలు

ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. 445 సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషాల్టీ డాక్టర్‌ పోస్టుల భర్తీకి మార్చి 23 నుంచి 27 వరకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది..

AP HMFW Recruitment 2023: విజయవాడలో 445 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు.. నేటి నుంచి మార్చి 27 వరకు నేరుగా ఇంటర్వ్యూలు
Vijayawada HMFW Jobs
Srilakshmi C
|

Updated on: Mar 23, 2023 | 8:46 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. 445 సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషాల్టీ డాక్టర్‌ పోస్టుల భర్తీకి మార్చి 23 నుంచి 27 వరకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, రేడియాలజీ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు మార్చి 23, 25, 27 తేదీల్లో కింది అడ్రస్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/ డీఎన్‌బీ/ పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొందిన అభ్యర్ధులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు గిరిజన ప్రాంతానికి రూ.2,50,000, గ్రామీణ ప్రాంతానికి రూ.2,00,000, పట్టణ ప్రాంతానికి రూ.1,30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌..

The Directorate of Medical Education Office, Old GGH Campus, Hanuman Pate, Vijayawada.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.