Malnutrition: అయ్యో దేవుడా.. పోషకాహార లోపంతో చిన్నారి మృతి.. మరికొంతమంది పరిస్థితి విషమం..

ఒడిశా జాజ్‌పూర్ జిల్లాలోని నగాడా గ్రామంలో పోషకాహార లోపం కారణంగా 2016లో జువాంగా తెగకు చెందిన 20 మంది శిశువులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత

Malnutrition: అయ్యో దేవుడా.. పోషకాహార లోపంతో చిన్నారి మృతి.. మరికొంతమంది పరిస్థితి విషమం..
Photo
Follow us

|

Updated on: Mar 25, 2023 | 8:57 AM

ఒడిశా జాజ్‌పూర్ జిల్లాలోని నగాడా గ్రామంలో పోషకాహార లోపం కారణంగా 2016లో జువాంగా తెగకు చెందిన 20 మంది శిశువులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత రాష్ట్రంలో పోషకాహార లోపం కారణంగా మరో మరణం నమోదుకావడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్‌గా మారిన హృదయ విదారక వీడియోలో ఒక తల్లి తీవ్రమైన పోషకాహార లోపంతో ఉన్న తన బిడ్డతో కూర్చుని ఉంది. అయితే కుటుంబంలోని పేదరికం చిన్నారి మృతికి కారణమైందని పేర్కొంటున్నారు.

అయితే, ఈ వీడియోలో ఓ మూలన వేరుశెనగలు తింటూ తోబుట్టువుల పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితిలో మరో చిన్నారి కనిపిస్తోంది. తల్లి.. పిల్లలిద్దరినీ నిస్సహాయంగా చూస్తూ కన్నీరుపెడుతోంది. ఆమె, తన కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి చెబుతూ కన్నీరుమున్నీరవుతోంది.

ఇవి కూడా చదవండి

మీడియాల కథనాల ప్రకారం.. ఈ వీడియో జాజ్‌పూర్ జిల్లా దానగడి బ్లాక్‌లోని రణగుండి పంచాయతీలోని ఘటిసాహి గ్రామానికి చెందినది. పౌష్టికాహార లోపంతో తన మొదటి బిడ్డ చనిపోయిందని.. ఇలాంటి పరిస్థితిలో రెండో రెండో బిడ్డ గురించి ఆందోళన చెందుతూ మహిళ కనిపించింది. అయితే, పోషకాహార లోపంతో మహిళ మంచాన పడిందని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఒడిశా ప్రభుత్వం కొత్త బిల్లులను ప్రతిపాదించి, సంక్షేమ పథకాలను ప్రకటించిన తర్వాత కూడా పోషకాహార లోపంతో ఇటీవల ఒక చిన్న పిల్లవాడు మరణించడం.. మరొకరి మనుగడ కోసం తల్లి పోరాడుతుండటం ప్రస్తుతం కంటనీరు పెట్టిస్తోంది.కూతురి పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్న తల్లి.. తన కూతురు నడవలేపోతుందని, కూర్చోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోందని చెప్పింది.

“ఆమె నడవలేకపోతుంది, కూర్చోలేకపోతోంది. ఆమె మంచాన పడింది. పరిస్థితి ఇప్పుడు మరింత క్షీణిస్తోంది” అంటూ ఆమె చెప్పింది. బంకు హెంబ్రామ్ తన భార్య తులసి హేంబ్రామ్ దంపతులు.. తొమ్మిది మంది పిల్లలతో కలిసి గ్రామంలో నివసిస్తున్నారని స్థానిక వర్గాలు తెలిపాయి.

పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించినా ఎవరూ ముందుకు రాలేదు. మిగతా పిల్లలు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారికి రేషన్‌కార్డు ఉందని, అయితే రేషన్‌ ద్వారా కుటుంబం కొంత గట్టెక్కుతుందని.. పెద్ద మొత్తంలో ఆహారధాన్యాలు అందించకపోవడంతో నీరు బియ్యం, ఉప్పుతోనే కుటుంబం బతుకుతుందని పేర్కొంది.

నివేదికల ప్రకారం, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు (DCPO) బృందంతో గ్రామాన్ని సందర్శించి పిల్లలందరినీ రక్షించారు. పిల్లలంతా ప్రస్తుతం సుకింద ప్రాంతంలో పరిశీలనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

‘‘మాకు న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ (NRC) ఉంది, ఒక కౌన్సిలర్, థెరపిస్ట్, పీడియాట్రిక్ స్పెషలిస్ట్ ఇప్పుడు పిల్లలని పర్యవేక్షిస్తున్నారు. మరో చిన్నారిని అంతకుముందు డీహెచ్‌హెచ్‌లో చేర్చారు. కానీ, పౌష్టికాహారలోపం గురించి తెలియని ప్రజలు ఆసుపత్రికి రావడానికి ఇష్టపడరు. కాబట్టి, మేము త్వరలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి.. పోషకాహారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాము, ”అని జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (CDMO), సిబాశిష్ మహారాణా తెలిపారు.

మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వీడియోపై ముఖ్య కార్యదర్శి, చీఫ్ డెవలప్‌మెంట్ కమిషనర్ స్పందిస్తూ ఈ విషయాన్ని పరిశీలించి కుటుంబానికి సహాయం చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను అభ్యర్థించారు.

కాగా, 2023లో కూడా పోషకాహార లోపంతో చిన్నారులు చనిపోవడం సిగ్గుచేటని నెటిజన్ ఒకరు పేర్కొన్నారు.

మరొకరు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా, భారతదేశం ఆహారం నీరు, విద్య, ఆరోగ్యం వంటి కనీస సౌకర్యాలను అందించలేకపోయింది.. అంటూ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!