Ram Navami: యువకుల్లో జోష్ నింపిన ఓలా స్కూటర్.. పాటలు, డ్యాన్సులు.. మామూలుగా లేదుగా..

19 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కొంతమంది యువకులు డ్యాన్స్ చేస్తున్నారు. వారి మెడలో కషాయ కండువాలు ఉన్నాయి. ఓలా స్కూటర్ లోని మ్యూజిక్ అండ్ పార్టీ మోడ్ ఆన్ చేసి, దానిలోని స్పీకర్స్ ద్వారా వస్తున్న పాటలకు వారు నృత్యాలు చేస్తున్నారు.

Ram Navami: యువకుల్లో జోష్ నింపిన ఓలా స్కూటర్.. పాటలు, డ్యాన్సులు.. మామూలుగా లేదుగా..
Ola Electric
Follow us
Madhu

|

Updated on: Mar 31, 2023 | 1:00 PM

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనం. తన అత్యాధునిక ఫీచర్లు, డిజైన్, పనితీరు, రేంజ్ అన్ని జనాలకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఫలితంగా విద్యుత్ శ్రేణి వాహనాల్లో టాప్ సెల్లర్ నిలిచింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో నంబర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీరామనవమి వేడుకల్లో ఓలా స్కూటర్ కూడా పాల్గొంది. పాటలకు డ్యాన్స్ చేసింది! అదెలా సాధ్యం అనుకుంటున్నారా? స్కూటర్ లో ఉన్న మ్యూజిక్ అండ్ పార్టీ మోడ్ తో అది సుసాధ్యమైంది. దీనికి సంబంధించిన వీడియోను ఓలా క్యాబ్స్ కో ఫౌండర్ భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో ఇదే మీరూ చూసేయండి..

వీడియోలో ఏముంది..

19 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కొంతమంది యువకులు డ్యాన్స్ చేస్తున్నారు. వారి మెడలో కషాయ కండువాలు ఉన్నాయి. ఓలా స్కూటర్ లోని మ్యూజిక్ అండ్ పార్టీ మోడ్ ఆన్ చేసి, దానిలోని స్పీకర్స్ ద్వారా వస్తున్న పాటలకు వారు నృత్యాలు చేస్తున్నారు. వారితో పాటు స్కూటర్ కూడా లైట్లను బ్లింకింగ్ చేస్తూ ఉత్సాహాన్ని నింపుతోంది. వారంతా శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ఇలా స్కూటర్ చుట్టూ చేరి ఉత్సాహంగా గడిపారు.

అగర్వాల్ ఏమన్నారంటే..

ఈ వీడియోను కృష్ణ ఖాన్డెల్వాల్ అనే వ్యక్తి ట్విట్టర్ లో ఓలా అకౌంట్ ను లింక్ చేస్తూ ట్విట్ చేశారు. దీనిలో ‘జై శ్రీరామ్.. శ్రీరామ నవమి పండుగ సందర్భగా రామ్ ఉత్సవ శోభతో నిండిన రాత్రి వేళ.. మా ఒత్తిళ్లను తగ్గించుకునేందుకు ఓలాను కలిగి ఉండటాన్ని ఆస్వాదిస్తున్నాం. జై శ్రీరామ్’ అని కోట్ చేశారు. దీనిని రీట్వీట్ చేసిన ఓలా క్యాబ్స్ కో ఫౌండర్ భవిష్ అగర్వాల్.. ఈ విధంగా అన్నారు.. వావ్.. ప్రజలు ఓలా స్కూటర్ లోని మ్యూజిక్ అండ్ పార్టీ మోడ్ ని ఇంత ఇష్టపడుతున్నారని మేము ఎప్పుడూ ఊహించలేదు. చాలా మంది జీవితాల్లో తాము సంతోషాన్ని నింపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!