AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. కళ్లు మూసుకో..’ హత్య చేసి, శరీర భాగాలు నదిలో విసిరేసిన స్నేహితుడు

భార్యను వేధిస్తున్నాడనే కోపంతో స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి చెత్త కుప్పలో పారేశాడు. గుజరాత్‌లో ఈ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

'సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. కళ్లు మూసుకో..' హత్య చేసి, శరీర భాగాలు నదిలో విసిరేసిన స్నేహితుడు
Ahmedabad Horror
Srilakshmi C
|

Updated on: Mar 31, 2023 | 12:09 PM

Share

భార్యను వేధిస్తున్నాడనే కోపంతో స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి చెత్త కుప్పలో పారేశాడు. గుజరాత్‌లో ఈ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో బాపునగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మహ్మద్‌ ఇమ్రాన్‌, అతని భార్య రిజ్వానాతో ఓ ఇంట్లో కాపురం ఉండేవాడు. ఇమ్రాన్‌కు మహ్మద్‌ మీరజ్‌ అనే స్నేహితుడు ఉండేవాడు. ఇమ్రాన్‌ భార్యపై కన్నేసిన మీరజ్‌.. మిత్రుడు ఇమ్రాన్‌ ఇంట్లో లేని సమయంలో తరచూ అతని ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఈక్రమంలో ఇమ్రాన్‌ భార్య రిజ్వానాను వేధించేవాడు. ఈ విషయాన్ని రిజ్వానా ఇమ్రాన్‌తో చెప్పగా దీనిపై ఆగ్రహించిన ఇమ్రాన్‌ పలుమార్లు మీరజ్‌ను హెచ్చరించినా తీరు మారకపోవడంతో అతణ్ని చంపాలని పథకం పన్నాడు.

ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 22న సర్‌ఫ్రైజ్‌ గిఫ్ట్‌ ఇస్తాననే నెపంతో మీరజ్‌ను ఇంటికి పిలిచింది రిజ్వానా. మేరాజ్ ఇంటికి వచ్చిన తర్వాత అతని కళ్లకు గంతలు కట్టి మంచానికి కట్టేశారు. ఇమ్రాన్‌ దంపతులిద్దరూ అతణ్ని కత్తితో పొడిచి చంపారు. అనంతరం మృతదేహం నుంచి తలను వేరుచేసి చెత్తకుప్పలో పడేశారు. ఇతర శరీర భాగాలను 10 ముక్కలు చేసి ఓ సంచిలో కుక్కి ఖరీకట్‌ కాలువలో విసిరేశారు. భర్త ఇంటికి రాకపోవడంతో మీరజ్‌ భార్య నస్రీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితుడైన ఇమ్రాన్‌పై అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. 40 మందితో గాలించి మీరజ్ శరీర భాగాలను కాలువ నుంచి వెలికితీశారు. కుటుంబీకుల డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, కాలువలో దొరికిన శరీర భాగాలతో సరిపోల్చేందుకు ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ పోలీసధికారి తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!