Ramayana Kalpavrksam at Hyderabad: మాదాపూర్‌లో రామాయణ కల్పవృక్షం సాంస్కృతిక మహోత్సవాలు.. నేటి నుంచి ప్రారంభం
హైదరాబాద్ నగరంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రామాయణ కల్పవృక్షం సాంస్కృతిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ ఆధ్వర్యంలో రామాయణ కల్పవృక్షం పేరిట హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంగీతం, నృత్య ప్రదర్శనలు, హరికథ..
హైదరాబాద్ నగరంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రామాయణ కల్పవృక్షం సాంస్కృతిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ ఆధ్వర్యంలో రామాయణ కల్పవృక్షం పేరిట హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంగీతం, నృత్య ప్రదర్శనలు, హరికథ, మానస్ పాథ్, తోలుబొమ్మలాట, రామాయణ ఇతిహాసంపై ప్రముఖుల ప్రసంగాలు వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఒకే వేధికపై వీక్షించే అవకాశం ఉంటుంది. మూడు రోజుల పాటు జరిగే రామాయణ కల్పవృక్షం ఉత్సవాల్లో అన్ని వయసుల వారు తమ అద్భుతమైన ప్రదర్శనలతో కనుల విందు చేయనున్నారు. ఇలాంటి కల్చరర్ ఈవెంట్లు హైదరాబాద్‌లో జరగడం ఇదే ప్రథమం. మర్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు మాదాపూర్‌లోని సీసీఆర్‌టీ క్యాంపస్ వేదికగా ఈ కల్చర్ ఈవెంట్ జరుగుతోంది. ఆసక్తి కలిగినవారు ఎవరైనా ఈ ప్రోగ్రాంకు హాజరుకావచ్చు. ఐతే ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. రూ.300ల నుంచి రూ.500ల వరకు టికెట్ ధరలు నిర్ణయించారు. ప్రోగ్రాంకు హాజరవగోరేవారు తప్పనిసరిగా టికెట్ బుక్ చేసుకోవల్సి ఉంటుంది.
ఏయే ఈవెంట్లు ఉంటాయంటే..
- రామాయణంలోని రాజధర్మ పాఠాలు
- 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు హైదరాబాద్‌లో కళాక్షేత్ర ప్రదర్శన సూపర్ సింగర్ ఫేమ్ అభిలాష్ వెంకిటాచలంతోపాటు సింగర్ సాయి విఘ్నేష్‌ల మ్యూజికల్ ఈవెనెంగ్ ప్రోగ్రాం
- కోలం వర్క్‌షాప్
- హరికథ ప్రదర్శన
- త్యాగరాజ పంచరత్న కృత్తుల గాన ప్రదర్శన
- పండిత గోష్ఠి
- జాతీయ అవార్డ్ గ్రహీత అనుపమ హోస్కెరే తోలుబొమ్మలాట ప్రదర్శన
- ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు
రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.