Bitter Gourd Juice: రోజూ ఉదయం పూట ఖాళీకడుపుతో ఈ జ్యూస్‌ తాగారంటే..

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావల్సిన పోషకాలు, విటమిన్లు చాలా అవసరం. లేదంటే రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు దాడి చేస్తాయి. ఆరోగ్యనికి మేలు చేసే కూరగాయలలో కాకరకాయ ముఖ్యమైనది. కాకరకాయతో తయారు చేసిన జ్యూస్‌..

Bitter Gourd Juice: రోజూ ఉదయం పూట ఖాళీకడుపుతో ఈ జ్యూస్‌ తాగారంటే..
Bitter Gourd Juice
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 30, 2023 | 11:26 AM

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావల్సిన పోషకాలు, విటమిన్లు చాలా అవసరం. లేదంటే రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు దాడి చేస్తాయి. ఆరోగ్యనికి మేలు చేసే కూరగాయలలో కాకరకాయ ముఖ్యమైనది. కాకరకాయతో తయారు చేసిన జ్యూస్‌ ఉదయాన్నే పరగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కాకరకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ అలర్జీ లక్షణాలు సుష్కలంగా ఉంటాయి. కాకరకాయ జ్యూస్‌ ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల దీనిలోని విటమిన్ సి వ్యాధినిరోధకత శక్తిని బలపరుస్తుంది. తద్వారా వ్యాధుల బారీన పడకుండా కాపాడుతుంది.

మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా కాకరకాయ తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే కాకరకాయ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కాకరకాయ జ్యూస్‌లోని హైపోగ్లైసీమిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు కాకకాయలతో చేసిన జ్యూస్‌ను రోజూ తాగమని సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చక్కని పరిష్కారం. ప్రతిరోజూ గ్లాస్‌ కాకరకాయ జ్యూస్‌ తాగితే కేవలం రోజుల వ్యవధిలోనే బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.