Telangana Crime: గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో మూడు విషాదాలు.. మనస్తాపంతో తల్లీకూతుళ్లు మృతి

దంపతుల మధ్య చిన్న గొడవ ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. భార్యపై కోపంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడితే.. తన వళ్లే భర్త అలా చేశాడనే మనస్తాపంతో భార్య ఉరిపెట్టుకుంది. కూతురి కాపురం ఇలా అయ్యిందేమిటనే ఆవేదనతో ఆమె తల్లి నీళ్ల సంపులో దూకి..

Telangana Crime: గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో మూడు విషాదాలు.. మనస్తాపంతో తల్లీకూతుళ్లు మృతి
Telangana Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 30, 2023 | 9:12 AM

దంపతుల మధ్య చిన్న గొడవ ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. భార్యపై కోపంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడితే.. తన వళ్లే భర్త అలా చేశాడనే మనస్తాపంతో భార్య ఉరిపెట్టుకుంది. కూతురి కాపురం ఇలా అయ్యిందేమిటనే ఆవేదనతో ఆమె తల్లి నీళ్ల సంపులో దూకి తనువు చాలించింది. గంటల వ్యవధిలో ఆ ఇంట్లో వరుస విషాదాలు చోటుచేసుకోవడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. ఈ విషాద సంఘటనలు బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నాయి. షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువయ్య గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

హైతాబాద్‌ గ్రామానికి చెందిన మల్లేశ్‌, యాదమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. మల్లేశ్‌ కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. కుమార్తె సుమిత్రకు రెండున్నర ఏళ్ల క్రితం రుద్రారం గ్రామానికి చెందిన కుమ్మరి శివకుమార్‌తో వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి వీరికి పిల్లలు పుట్టలేదు. ఆదివారం వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో శివకుమార్‌ పురుగుల మందు తాగడంతో బంధువులు హుటాహుటీన వికారాబాద్‌లోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం శివకుమార్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఐతే తనవల్లే భర్త ఆత్మహత్యకు యత్నించాడన్న మనస్తాపంతో సుమిత్ర మంగళవారం రాత్రి హైతాబాద్‌లోని పుట్టింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం నిద్రలేచిన తల్లి యాదమ్మ(45) కుమార్తె మృతి చెందిఉండటాన్ని గమనించింది.

అనంతరం తన కుమార్తె జీవితం ఇలా అయ్యిందే అన్న బాధతో ఇంటి ముందు ఉన్న సంపులో దూకి యాదమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గంట వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ గురువయ్య గౌడ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!