Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఏడాదికి ఉచితంగా 5 ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లు.. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.2 వేలు’

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్లపై 50 శాతం సబ్సిడీ అందిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామీ ఆ రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశారు. యశ్వంత్‌పూర్ నియోజకవర్గంలో పంచరత్న రథయాత్ర నిర్వహిస్తున్న జేడీఎస్ నేత కుమారస్వామీ వచ్చేనెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో..

'ఏడాదికి ఉచితంగా 5 ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లు.. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.2 వేలు'
Karnataka Polls
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 29, 2023 | 11:31 AM

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్లపై 50 శాతం సబ్సిడీ అందిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామీ ఆ రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశారు. యశ్వంత్‌పూర్ నియోజకవర్గంలో పంచరత్న రథయాత్ర నిర్వహిస్తున్న జేడీఎస్ నేత కుమారస్వామీ వచ్చేనెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఉచిత గ్యాస్‌ ఇస్తామని వాగ్దానం చేసిన కేంద్రం అధికారంలోకి వచ్చాక ఉజ్వల పథకాన్ని అమలు చేస్తోంది. బీజేపీ వాగ్దానాలు నమ్మి ఓట్లు వేసిన మహిళలకు కేంద్రం షాకిచ్చింది. సిలిండర్ ధర రూ.1000లకుపైగా పెరగడంతో పేదలు కష్టాలుపడుతున్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్‌పై రాయితీ మాత్రమేకాకుండా ఏడాదికి ఐదు ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేసాం. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 2,000ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. అంగన్‌వాడీ కార్యకర్తలను పర్మినెంట్‌ చేస్తామని’ కుమారస్వామి తన ప్రసంగంలో తెలిపారు.

కాగా కర్ణాటకలోని 224 స్థానాలకు వచ్చేనెలలో (ఏప్రిల్‌) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జేడీఎస్‌ గతేడాది డిసెంబర్‌లో 93 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరోవపై కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్లు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 78 సీట్లు గెలుచుకోగా, జేడీఎస్ 37 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్‌తో కలిసి జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కుమారస్వామిని ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే సరిగ్గా ఏడాది తర్వాత జేడీఎస్-కాంగ్రెస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం పడిపోవడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈక్రమంలో ఈసారి జరనున్న అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటకలో మరింత రసవత్తరంగా మారనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.