AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amritpal Singh: అమృత్‌ పాల్‌ సింగ్ జాడేది..? నేపాల్‌ సాయం కోరిన కేంద్రం

ఖలిస్థాన్ ఉద్యమ నేత అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పంజాబ్ నుంచి మారు వేషంలో పరారైన అమృత్ పాల్ సింగ్ తొలుత హర్యానా వెళ్లినట్టుగా సీసీటీవీ విజువల్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అమృత్‌ పాల్ పోలీసులు..

Amritpal Singh: అమృత్‌ పాల్‌ సింగ్ జాడేది..? నేపాల్‌ సాయం కోరిన కేంద్రం
Amritpal Singh
Srilakshmi C
|

Updated on: Mar 29, 2023 | 7:36 AM

Share

ఖలిస్థాన్ ఉద్యమ నేత అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పంజాబ్ నుంచి మారు వేషంలో పరారైన అమృత్ పాల్ సింగ్ తొలుత హర్యానా వెళ్లినట్టుగా సీసీటీవీ విజువల్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అమృత్‌ పాల్ పోలీసులు తనను పట్టుకుంటారనే ఆలోచనతో ఉత్తరాఖండ్‌కి మకాం మార్చినట్లు సమాచారం అందింది. తాజాగా అమృత్ పాల్ సింగ్ తలకు టర్బన్ లేకుండా ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకొచ్చింది. ఆ సమయంలో అమృత్ పాల్ సింగ్ ప్రధాన అనుచరుడైన పపల్ ప్రీత్ సింగ్ కూడా అతడి వెంటే ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీ స్పష్టంచేస్తోంది. తలకు టర్బన్ లేకుండా పెరిగిన జుట్టుతో ఉన్న అమృత్ పాల్ సింగ్.. ముఖానికి మాస్క్ ధరించి కనిపించాడు. అందులో ఉన్నది అసలు అమృత్ పాల్ సింగ్, అతడి అనుచరుడు పపల్ ప్రీత్ సింగేనా లేక అలా కనిపిస్తున్న మరొకరా అనే విషయాన్ని ధృవీకరించుకునే పనిలో ఉన్నారు పోలీసులు. అంతేకాకుండా అసలు సీసీటీవీ కెమెరా దృశ్యాలు కూడా అసలు ఢిల్లీ మార్కెట్ లోనివేనా అనే అనుమానాలు ఉన్నాయి.

మార్చి 18న అమృత్ పాల్ సింగ్ జలంధర్‌లో పోలీసుల నుంచి సినీ ఫక్కీలో దుస్తులు మారుస్తూ, వాహనాలు మారుస్తూ పరారైనప్పటి నుంచి అనేక రకాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్వరలోనే అమృత్ పాల్ సింగ్ ని పట్టుకుంటాం అంటూ కోర్టుకు వివరించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. అయితే అమృత్​పాల్ సింగ్ నేపాల్‌లో దాక్కున్నట్లు మరో సమాచారం అందుతుంది. అతను నేపాల్ నుంచి వేరే దేశానికి పారిపోకుండా నేపాల్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్​ కాన్సులర్ సర్వీసెస్ కు లేఖ రాసింది. అమృత్ పాల్‌ను అరెస్టు చేయడంలో ప్రభుత్వ సంస్థలు సాయం చేయాలని ఖాట్మండులోని ఇండియన్ ఎంబసీ కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..