AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఎత్తులు.. ఇంట్లో కూర్చోబెట్టే లక్షలు దోచేస్తున్న కేటుగాళ్లు..

మహిళలే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్ల ఎత్తులు రోజురోజుకూ సృతి మించుతున్నాయి. తాజాగా తెలంగాణలోని అబిడ్స్‌లో ఓ యువతి వీరి మాయలోపడి రూ.5 లక్షలు పోగొట్టుకుంది. బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్న యువతి మొబైల్‌ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఇంటి వద్ద ఉంటూనే రోజూకు అరగంట పని చేసుకుని..

Hyderabad: మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఎత్తులు.. ఇంట్లో కూర్చోబెట్టే లక్షలు దోచేస్తున్న కేటుగాళ్లు..
Hyderabad Cyber Crimes
Srilakshmi C
|

Updated on: Mar 28, 2023 | 12:13 PM

Share

మహిళలే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్ల ఎత్తులు రోజురోజుకూ సృతి మించుతున్నాయి. తాజాగా తెలంగాణలోని అబిడ్స్‌లో ఓ యువతి వీరి మాయలోపడి రూ.5 లక్షలు పోగొట్టుకుంది. బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్న యువతి మొబైల్‌ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఇంటి వద్ద ఉంటూనే రోజూకు అరగంట పని చేసుకుని రూ.700ల నుంచి 900ల వరకు సంపాదించొచ్చంటూ ఆశ చూపారు. అందుకు ముందుగా రూ.2,000 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద కట్టించుకున్నారు. నెల తర్వాత డిజిటల్‌ ఖాతాలో రూ.28 వేల ఆదాయం చూపారు. ఆ మొత్తం సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు అదనంగా రూ.50 వేలు డిపాజిట్‌ చేయాలనే షరతు పెట్టారు. సంపాదన పెరుగుతున్న కొద్దీ డిపాజిట్‌ పెంచుతూ వచ్చారు. ఈ క్రమంలో రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయించుకొని చెప్పాపెట్టకుండా ఖాతా రద్దు చేశారు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను సంప్రదించింది.

ఇలా ఫోన్లకు తొలుత పార్ట్‌టైం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అంటూ మెసేజ్‌లను పంపించి ఆశల వల విసురుతున్నారు. గతంలో దీపాల వత్తులు, కరక్కాయ పొడి, బుక్స్‌ పీడీఎఫ్‌గా మార్చి రూ.లక్షలు సంపాదించమంటూ సామాజిక మాధ్యమాల వేదికగా మోసగాళ్లు చెలరేగారు. వీరి వలలో గృహిణులు, యువతులు అధికంగా చిక్కుకుంటున్నారు. నగరంలో సైబర్‌ క్రైమ్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో అధిక శాతం ఉద్యోగం, పెట్టుబడులకు సంబంధించిన మోసాలే ఉంటున్నాయి. బాధితుల్లో విద్యార్థినులు, ఉన్నత విద్యావంతులు, గృహిణులు అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా ఉద్యోగ వేటలో ఉన్న యువతులు తేలికగా బుట్టలో పడుతున్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో 2-3 గంటలు కష్టపడితే చాలనే ఉద్దేశంతో బాధితులు అవతలి వారి మాటలను నమ్ముతూ ఉచ్చులో చిక్కుతున్నారు. ఇంట్లో ఉంటూ సంపాదించే అవకాశం ఉందనగానే తేలికగా నమ్మి సామాజిక మాధ్యమాలు, ఫోన్లకు వచ్చే ఇటువంటి ప్రకటనలు నమ్మొద్దు. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండంటూ హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ డీసీపీ నేహా మెహ్రా సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?