AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ భార్యపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేసిన ప్రముఖ నటుడు

ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ మాజీ భార్య అంజనా పాండేపై పరువు నష్టం దావా వేశాడు. మాజీ భార్య అంజనాతోపాటు తన సోదరుడు షమాజుద్దీన్‌లపై దావా వేశాడు. తన పరువుకు భంగం కలిగించేలా వారు వ్యవహరించారని వీరిపై ఏకంగా 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా..

మాజీ భార్యపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేసిన ప్రముఖ నటుడు
Actor Nawazuddin Siddiqui
Srilakshmi C
|

Updated on: Mar 27, 2023 | 12:02 PM

Share

ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ మాజీ భార్య అంజనా పాండేపై పరువు నష్టం దావా వేశాడు. మాజీ భార్య అంజనాతోపాటు తన సోదరుడు షమాజుద్దీన్‌లపై దావా వేశాడు. తన పరువుకు భంగం కలిగించేలా వారు వ్యవహరించారని వీరిపై ఏకంగా 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. అసత్యాలు ప్రచారం చేస్తూ, తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ నవాజుద్దీన్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను వెంటనే తొలగించాలని, అంజన పాండే, షమాజుద్దీన్ లిఖిత పూర్వకంగా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని పేర్కొంటూ నవాజుద్దీన్ సిద్ధిఖీ పిటిషన్‌లో పేర్కొన్నారు.

షమాజుద్దీన్‌కు ఏ ఉద్యోగం లేకపోవడంతో తన వద్ద 2008లో మేనేజర్‌గా నియమించుకున్నాడని, సోదరుడిని నమ్మి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, అకౌంట్ల పాస్‌వర్డ్‌లు అన్నీ అతనికి ఇచ్చానని, అయితే అతను తనను ఆర్థికంగా మోసం చేశాడని పిటిషన్‌లో తెలిపారు. సోదరుడి మోసం గుర్తించి 2020లో దూరం పెట్టానని, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, జీఎస్టీ వంటి ఇతర సంస్థలకు కట్టకుండా రూ.37 కోట్లు మాయం చేసినట్లు ఆరోపించారు. తనవద్ద కాజేసిన డబ్బుతో షమాజుద్దీన్ ఆస్తులు కొనుగోలు చేశారని, ఇదంతా తెలిసి ప్రశ్నించినందుకు మాజీ భార్య అంజనాను తనపై ఉసిగొల్పాడని తెలిపారు. తన సోదరుడు, మాజీ భార్య కలిసి తనకు సంబంధించిన రూ.21 కోట్లను దుర్వినియోగం చేశారని నవాజుద్దీన్ ఆరోపించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ న్యాయవాది సునీల్ కుమార్ ద్వారా దాఖలు చేయబడిన ఈ వ్యాజ్యం మార్చి 30న జస్టిస్ రియాజ్ చాగ్లా ధర్మాసనం ముందు విచారణకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.